
why Indira Devi gaaru staying alone with out her family
Indira Devi : సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృ మూర్తి ఇందిరా దేవి మరణం ఇండస్ట్రీ వర్గాల్లో దుఃఖాన్ని మిగిల్చింది. మరణం సమయంలో ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో ఆమె కనీసం బెడ్ పై నుంచి లేచి కూర్చోలేక పోయారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అంతా తన పక్కనే ఉన్నారు. కానీ చాలా సంవత్సరాలుగా ఆమె పద్మాలయ స్టూడియోలోనే తన ఇంట్లో ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మహేష్ బాబు ఇంట్లో కానీ.. కూతుర్ల ఇంటిలో కానీ.. భర్త కృష్ణతో కానీ కలిసి ఉండకుండా ఇందిరా దేవి గారు ఒక ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు వెళ్లి ఆమెను పలకరించడం, పరామర్శించడం చేసేవారు. కానీ ఎక్కువ శాతం ఆమె ఒంటరి జీవితాన్ని గడిపారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఆ విషయంలో నిజమెంతో కానీ చనిపోయిన సమయంలో మాత్రం ఆమె ఒంటరిగానే ఉన్నారని సమాచారం అందుతుంది. ఎందుకు ఆమె మహేష్ బాబు ఇంట్లో కానీ.. కృష్ణ ఇంట్లో కానీ ఉండలేదు అనేది ఇప్పుడు చాలా మందిలో ఉన్న ప్రశ్న. విజయ నిర్మల చనిపోయిన తర్వాత ఎందుకు కృష్ణ మరియు ఇందిరా దేవి కలిసి ఉండలేదు అనేది కొందరి ప్రశ్న. అసలు విషయం ఏంటంటే కృష్ణ ప్రస్తుతం ఉన్న ఇంటికి ఇందిరా దేవి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. కారణం ఆ ఇంటి ని కృష్ణ మరియు విజయనిర్మల కట్టించుకున్నారు. వారిద్దరూ చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు.
why Indira Devi gaaru staying alone with out her family
కనుక ఆ ఇంట్లోకి ఇందిరా దేవి గారికి వెళ్లాలని ఆసక్తి లేదు. ఇక మహేష్ బాబు ఇంటికి వెళ్లేందుకు కూడా ఆమె ఆసక్తి చూపించలేదు. తాను ఎవరికి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతోనే ఒంటరిగా పద్మల స్టూడియోలోని ఇంట్లో ఉంటున్నట్లుగా ఆమె సన్నిహితుల వద్ద గతంలో చెప్పుకొచ్చారట. సర్వ సౌకర్యాలు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆమె ఒంటరితనం ఫీల్ అయ్యేవారని ఆ ఇంట్లో పనిచేసే వారు చెప్పుకుంటున్నారు. మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తన తల్లిని వేరే ఇంట్లో ఉంచడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ఈ సమయంలో ప్రశ్నిస్తున్నారు. ఇందిరా దేవి మరణం తర్వాత అనేక రకాలుగా ప్రచారాలు తెర ముందుకు వస్తున్నాయి. అందులో ఇది ఒకటి.. ఈ ప్రచారంలో నిజం ఎంత అనేది ఆ కుటుంబ సభ్యులు నోరు విప్పితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.