Jr NTR : వైయస్ జగన్ తో మీటింగ్ కు ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదంటే..!
Jr NTR : ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డితో జరిగిన టాలీవుడ్ ప్రముఖుల భేటీ ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యం లో మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, ఆర్.నారాయణమూర్తి, ఆలీ ఇంకా పలువురు ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీకి ఎన్టీఆర్ ని కూడా చిరంజీవి ఆహ్వానించాడు అనే వార్తలు వచ్చాయి. టాలీవుడ్ నుండి ప్రముఖ హీరోలు జగన్ తో భేటీకి రావాలంటూ పేర్ని నాని సూచించడం తో చిరంజీవి ఈ స్టార్స్ ని తీసుకుని వెళ్లి జగన్మోహన్ రెడ్డి వద్ద టికెట్ల పెంపు విషయమై విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లేందుకు ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం అందుతోంది.ఎంత కాదన్నా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి..
నందమూరి కుటుంబం కు చెందిన తెలుగుదేశం పార్టీ లో ఆయన ఉన్నా లేకున్నా కూడా ఆయన్ను తెలుగు దేశం బిడ్డగానే ప్రతి ఒక్కరు భావిస్తారు. ఈ సమయం లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు టికెట్ల రేట్లు విషయమై సినిమా హీరోలతో కలిసి వెళితే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో… తెలుగు దేశం పార్టీ నాయకులు ఎలా అర్థం చేసుకుంటారో అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఈ భేటీకి దూరంగా ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సివుంది.ఇక నాగార్జున కూడా ఈ భేటీకి వెళ్లాల్సి ఉండగా అమలకు ఇటీవలే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అందుకే నాగార్జున కూడా ఈ సమయంలో క్వారెంటైన్ లో ఉంటున్నాడు. కనుక ముఖ్యమంత్రి తో భేటీ కి వెళ్లడం సబబు కాదని ఉద్దేశం తో నాగార్జున ఈ భేటీకి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
నందమూరి మరియు అక్కినేని కుటుంబాల నుంచి ఈ భేటీకి హీరోలు రాకపోవడం తో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మహేష్ బాబు, చిరంజీవి, ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ లు ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కూడా హాజరు అయ్యి ఉంటే నలుగురు సూపర్ స్టార్స్ ని చూసే అవకాశం దక్కేది. జగన్ తో భేటీ విషయంలో ఎన్టీఆర్ కాస్త అతిగా ఆలోచించడం వల్ల దూరం అయ్యాడని… తద్వార ఆ అరుదైన సంఘటన జరగలేదు అంటున్నారు. మొత్తానికి ముగ్గురు హీరోలు కలిసి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లడంతో టాలీవుడ్ పరిశ్రమకు చెందిన సమస్యకు ఒక పరిష్కారం అయితే లభించినట్లు అయింది.