Mega Heroes : మెగా ఫ్యామిలీ ఎక్కడ.. పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు.. అల్లు అర్జున్ ని పలకరించని మెగా హీరోలు కారణం ఏంటి..?
ప్రధానాంశాలు:
Mega Heroes : మెగా ఫ్యామిలీ ఎక్కడ.. పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు.. అల్లు అర్జున్ ని పలకరించని మెగా హీరోలు కారణం ఏంటి..?
Mega Heroes : 12 గంటలు చంచల్ గూడా జైల్లో ఉన్న అల్లు అర్జున్ ని ఇండస్ట్రీ మొత్తం పలకరించేందుకు కదలి వచ్చింది. పరిశ్రమంలో ఉన్న దర్శక నిర్మాతలు అందరూ అల్లు అర్జున్ ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించారు. నీకు సపోర్ట్ గా మేమున్నాం అని టాలీవుడ్ అంతా ఏక కంఠంతో చెప్పింది. అయితే ఈ విషయంలో మెగా ఫాన్స్ ఆల్రెడీ అల్లు అర్జున్ కి సపోర్ట్ గా నిలిచిన విషయం తెలిసిందే. కానీ అల్లు అర్జున్ ఇంటికి ఒక్క మెగా హీరో కూడా రాకపోవడం వెనక కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీస్తున్నారు. అల్లు అర్జున్ ని పలకరించేందుకు దాదాపు టాలీవుడ్ అంతా కూడా శనివారం అతను ఇంటికి వెళ్లారు. దర్శకులు, నిర్మాతలు యువ హీరోలు అంతా కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ గా ఉన్నామని చెప్పేలా అక్కడికి వచ్చారు. అయితే మెగా హీరోలు ఒక్కరు కూడా అల్లు అర్జున్ ని పలకరించేందుకు రాలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అనగానే మెగాస్టార్ చిరంజీవి సురేఖతోపాటు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
Mega Heroes అల్లు అర్జున్ ని వారంతా అవైడ్ చేసినట్టుగానే..
అల్లు అర్జున్ జైలు నుండి ఇంటికి వచ్చిన తర్వాత మెగా హీరోలెవరు అతన్ని పలకరించడానికి రాలేదు. మరో పక్క పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వచ్చారని తెలిసినా అల్లు అర్జున్ ని కలిసినట్టు మాత్రం తెలియదు. మెగ హీరోలైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఆల్మోస్ట్ అల్లు అర్జున్ ని వారంతా అవైడ్ చేసినట్టుగానే భావిస్తున్నారు అల్లు ఫాన్స్. అల్లు అర్జున్ అరెస్ట్ అనగానే మెగాస్టార్ చిరంజీవి నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
మరి శనివారం వాళ్లెవరు అల్లు అర్జున్ పలకరించేందుకు ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎంత ఫోన్లో మాట్లాడిన అందరికీ కనిపించేలా ఒకసారి కలవడం అనేది జరిగితే బాగుండేదని మెగా ఫాన్స్ కోరుతున్నారు. మెగా హీరోలెవరు అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించకపోవడంతో ఇంకా అల్లు మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వారు కొనసాగుతుందని భావిస్తున్నారు. దీనికి ముగింపు పలకాలంటే మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకు రావాల్సి ఉంది. అప్పుడు కానీ ఈ ఇష్యుకి ఒక ఎండ్ కార్డు పడినట్టు అవుతుంది. Why Mega Heroes Avaided Allu Arjun in Arrest Issue , Mega hero, Allu Arjun, Chiranjeevi, Pawan Kalyan ,