Ali – Pawan Kalyan : ఆలీ పేరు చెబితే రగిలిపోతోన్న పవన్ కళ్యాణ్.. అతని కూతురు పెళ్ళికి రమ్మంటే ఒకే ఒక్క మాట అన్నాడు

Advertisement

Ali – Pawan Kalyan : తెలుగు కమెడియన్ అలీ కూతురు పెళ్లి నిన్న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది హాజరు అయ్యారు. నిజానికి.. తెలుగు ఇండస్ట్రీలో అలీకి ఉన్న క్రేజ్ వేరు. చాలా మంది సీనియర్ నటులు, నిర్మాతలు, దర్శకులు, ఇతర నటులు అందరూ అలీకి చాలా దగ్గర. ఆయనతో చాలా క్లోజ్ గా ఉంటారు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి అలీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

అయితే.. హైదరాబాద్ లో అలీ కూతురు ఫాతిమా మ్యారేజ్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి.. నాగార్జున, శ్రీకాంత్, బ్రహ్మానందం, త్రివిక్రమ్, అల్లు అరవింద్, నాని లాంటి చాలా మంది సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు హాజరయ్యారు. కానీ.. తనకు ఎంతో ఆప్తమిత్రుడైన పవన్ మాత్రం ఈ పెళ్లికి హాజరు కాలేదు. వాళ్ల మధ్య ఉన్న స్నేహబంధాన్ని రాజకీయమే దూరం చేసిందా? అందుకే.. పవన్ కళ్యాణ్.. అలీ కూతురు పెళ్లికి హాజరు కాలేదనే వార్తలు వినవస్తున్నాయి. అసలు.. పవన్ కళ్యాణ్ తొలి సినిమా నుంచి మొన్నటి వరకు పవన్ నటించిన అన్ని సినిమాల్లో ఖచ్చితంగా అలీ నటించేవాడు.

Advertisement
why pawan kalyan not attended for ali daughter marriage
why pawan kalyan not attended for ali daughter marriage

Ali – Pawan Kalyan : రాజకీయమే వాళ్ల మధ్య స్నేహబంధాన్ని దూరం చేసిందా?

కానీ.. ఇప్పుడు ఏమైందో అర్థం కావడం లేదు.. అలీ వైసీపీలో చేరడం వల్ల అలీకి, పవన్ కు మధ్య గ్యాప్ వచ్చిందని అంటున్నారు. అసలు.. అలీతో కలవడానికి పవన్ ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదట. చివరకు తన కూతురు పెళ్లి కార్డు ఇద్దామని వెళ్లినా పవన్ అలీని కలవలేదని వార్తలు వస్తున్నాయి. అందుకే.. పవన్ కళ్యాణ్.. అలీ కూతురు పెళ్లికి హాజరు కాలేదా అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం రాజకీయాలే వీళ్లిద్దరినీ విడదీశాయని అంటున్నారు. చూద్దాం మరి భవిష్యత్తులో అయినా ఇద్దరూ కలిసి మళ్లీ వెండి తెర మీద కనిపిస్తారో లేదో?

Advertisement
Advertisement