Taraka Ratna : అంతటి బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా తారకరత్న అలేఖ్య రెడ్డి ని సీక్రెట్ గా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు..!!
Taraka Ratna ;’ తారకరత్నకు అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న తన పెళ్లిని చాలా సీక్రెట్ గా చేసుకున్నాడు. తారకరత్న, అలేఖ్య పెళ్లి 2012 ఆగస్ట్ 2, హైదరాబాద్ లోని సంఘీ టెంపుల్లో చాలా సింపుల్ గా జరిగింది. అయితే వీళ్ళ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో అలా చేసుకున్నామని చాలా సందర్భాల్లో తారకరత్న చెప్పుకొచ్చాడు. అంతేకాదు తమ మాట కాదని ప్రేమ వివాహ చేసుకోవడంతో తారకరత్నను కొన్నాళ్లపాటు నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టింది. ఈ సమయంలో తారకరత్న చాలా బాధ అనుభవించాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇక అలేఖ్య రెడ్డికి ఇది రెండవ పెళ్లి. ఈమె వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతురు. తారకరత్న విజయసాయి రెడ్డికి అల్లుడు వరుస అవుతాడు.
అయితే వీళ్ళిద్దరి పెళ్ళికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలపలేదు. అయితే అప్పుడు విజయసాయిరెడ్డి పెదనాన్న తనకు అండగా నిలిచారని అలేఖ్య రెడ్డి పలు మార్లు చెప్పుకొచ్చారు. అలేఖ్య రెడ్డి సోదరి చెన్నైలోనే పాఠశాలలో చదువుకున్నారు. ఆమెకు తారకరత్న సీనియర్. అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఒక ఫ్రెండ్ ద్వారా ఇద్దరు కలుసుకున్నారు. తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకి అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ముందుగా తారకరత్న అలేఖ్యకు లవ్ ప్రపోజ్ చేశారు. ఆమెకం రెండో పెళ్లి కావడంతో తారకరత్న కుటుంబ సభ్యులు అందుకు నిరాకరించారు.
అలేఖ్యకు మొదటగా మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు సందీప్ తో వివాహం జరిగింది. వీళ్లిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే అలేఖ్యతో వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో తారకరత్న సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో తారకరత్న కుటుంబ సభ్యులు అతడిని దూరం పెట్టారు. చివరికి తన సొంత చెల్లెలు రూప పెళ్లికి కూడా తారకరత్న పిలవలేదు. పెళ్లయిన ఏడాదికి తారకరత్న, అలేఖ్య దంపతులకు కుమార్తె నిష్క జన్మించింది. ఆమె అంటే తారకరత్నకు ప్రాణం. ఆమెతో ఎక్కువ టైం గడిపేవారు. కుమార్తె ఫోటోలను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేసేవారు.