
why The Kerala Story Movie creating controversy
The Kerala Story Movie: ప్రస్తుతం ఎవరి నోట చూసినా అదే మాట. ది కేరళ స్టోరీ సినిమా గురించే అందరూ చర్చిస్తున్నారు. ఆ సినిమాకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆ సినిమాపై చాలా మంది రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఆ సినిమాపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా స్పందించారు. ఇది మీ కేరళ స్టోరీ. మా కేరళ స్టోరీ కాదంటూ ఆయన డిఫరెంట్ గా స్పందించారు. అయినప్పటికీ ఆ సినిమాను నిషేధించాలని అని నేను కోరుకోవడం లేదు అని అన్నారు.
why The Kerala Story Movie creating controversy
భావాప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ దానికి అసలు విలువే ఉండదు. ఈ సినిమా వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంది. కేరళ వాసులు కూడా అదే చెబుతున్నారు. వాళ్లకు ఆ హక్కు కూడా ఉంది. కావాలని కేరళ వ్యతిరేక శక్తులు ఈ సినిమాను తీశారు అంటూ మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ కూడా స్పందించారు. ఇది కేరళ ఖ్యాతినే తగ్గించే కుట్ర. మతాలను అడ్డం పెట్టుకొని ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది.. అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఈ సినిమా కథ నచ్చి చేశా తప్పితే ఈ సినిమాలో నటించిన క్యారెక్టర్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు.
నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు అని ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఆదా శర్మ చెప్పుకొచ్చింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి సినిమాపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. హిందువుల మీద ఎలా దాడులు జరుగుతున్నాయో ఈ సినిమాలో స్పష్టంగా వివరించినప్పటికీ.. కేరళలో అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవని చాలామంది రాజకీయ నాయకులు కొట్టిపారేస్తున్నారు. అసలు ఈ సినిమాలో మతం అనేదే లేదు. మతాన్ని మీరు లాగుతున్నారు. ఇది కేవలం ఉగ్రవాదానికి సంబంధించిన సినిమా అంటూ సినిమా డైరెక్టర్ సుదీప్తో సేన్ చెప్పినా వినకుండా ఈ సినిమాకు మతం రంగును పూస్తున్నారు కొందరు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.