Sita Ramam Movie 2 Story ; ఇటీవల వచ్చిన సీతారామం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లాసిక్ లవ్ స్టోరీ గా పేరు తెచ్చుకుంది ఎంతోమంది ప్రేక్షకులు ఆ సినిమా చూసి కదలిపోయారు. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఆ సినిమాకి ఫిదా అయిపోయారు. రాఘవేంద్రరావు లాంటి లెజెండరీ డైరెక్టర్ కూడా సీతారామం సినిమాను ఎంతగానో ప్రశంసించారు. ఈ సినిమా తనను ఎమోషనల్ గా కదిలించిందని వైజయంతి వారి కొత్త సినిమా అన్ని మంచి శకునములేకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్లో వెల్లడించారు.
సీతారామం తర్వాత వస్తున్న ఈ సినిమాకి అదృష్టం కలిసి వస్తుందని పెద్ద హిట్ అవుతుందని ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని ఆయన నిర్మాత స్వప్నని కోరారు. సీతారామం సినిమాలో సీత పరిస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందని ఆమెను అలా వదిలేయకుండా ఈ కథను పొడిగించి సీక్వెల్ తీయాలని రాఘవేంద్రరావు సూచించారు. అందుకోసం స్టోరీ లైన్ కూడా ఆయన చెప్పడం విశేషం రామ్ చనిపోయాడన్న బాధతో తుపాకీ తీసుకొని సీత విలన్ దగ్గరికి వెళుతుందని అప్పుడు అతను మీ రామ్ చనిపోలేదంటూ ఒక గుహలోకి తీసుకెళ్లి చూపిస్తాడని సెకండ్ పార్ట్ అక్కడినుంచి రామ్ ను విడిపించుకుని వచ్చాక సీత కుటుంబ సభ్యులు వారిని వెంటాడుతారని
ఇలా స్టోరీని సెకండ్ పార్ట్ తీయాలని రాఘవేంద్రరావు కోరారు. సీత గురించి ఇప్పుడు తలుచుకున్న తన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయని, ఆమె కథ కొనసాగించాలని తనకు న్యాయం చేయాలని రాఘవేంద్రరావు ఓ ఈవెంట్ లో చెప్పారు. దీంతో అక్కడున్న నిర్మాతలు స్వప్న, అల్లు అరవింద్ సహ అందరు నవ్వేశారు. దీంతో సీతారామం సినిమాకు కచ్చితంగా సీక్వెల్ వస్తుందని తెలుస్తుంది. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ వస్తుందో వేచి చూడాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.