Genelia : హహ హాసని అంటూ బొమ్మరిల్లు సినిమాలో మనల్ని తెగ నవ్వించిన జెనీలియా గుర్తుంది కదా. హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హాసిని ఒకానొక సమయంలో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తను 20 ఏళ్ల కిందనే బాలీవుడ్ సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాతనే తెలుగు, తమిళం సినిమాల్లో నటించింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళం, కన్నడ మాత్రమే కాదు.. బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించింది ఈ సుందరి. అంతే కాదు.. బొమ్మరిల్లు సినిమాకు గాను తనకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కింది. కొన్నేళ్ల పాటు సినిమాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ భామ.
అయితే.. తన లైఫ్ లో ఎన్నో కాంట్రవర్సీలను ఎదుర్కొన్నది జెనీలియా. పెళ్లికి ముందే తను చాలా కాంట్రవర్సీల్లో చిక్కుకుంది. కానీ.. చాలామందికి ఆ విషయం తెలియదు. 2010 లో జరిగిన ఘటన ఇది. కొలంబోలో జరిగిన ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ఫంక్షన్ కు హాజరు అయినప్పుడు తను కాంట్రవర్సీలలో చిక్కుకుంది. కొలంబోలో పెద్ద ఘోరం జరిగింది. శ్రీలంక ప్రభుత్వం.. ఎల్టీఈ తీవ్రవాదులు అనే నెపంతో చాలామంది సామాన్యులను పొట్టన పెట్టుకుంది. కాల్చి చంపింది. దీంతో ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ఫంక్షన్ కు సౌంత్ ఇండియన్ నటీనటులు హాజరు కాలేదు. చివరకు బాలీవుడ్ కూడా బాయ్ కాట్ చేసింది. కానీ.. కొలంబోలో మాత్రం రితేష్, జెనీలియా మీడియా కంట పడ్డారు. దీంతో జెనీలియాతో పాటు రితేష్ ను కూడా సినీ ఇండస్ట్రీ నుంచే బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కొన్నేళ్ల పాటు జెనీలియా సినీ ఇండస్ట్రీకి దూరం అయింది.
why there are many controversies in genelia life
అదేంటి.. జాన్ అబ్రహంతో పెళ్లేంటి అని అనుకుంటున్నారా? హిందీలో ఫోర్స్ అనే సినిమాలో నటించింది జెనీలియా. ఆ సమయంలో సినిమా షూటింగ్ లో భాగంగా పెళ్లి సీన్ షూట్ చేశారట. అయితే అది రియల్ గా ఉండాలని ఏకంగా నిజమైన పండితుడినే పిలిచి పెళ్లి షూట్ చేశారట. మంత్రాలు చదివి.. అచ్చం నిజమైన పెళ్లి ఎలా చేస్తారో అలాగే జాన్ అబ్రహానికి పెళ్లి చేశారట. కట్ చేస్తే జెనీలియా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసింది. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. జెనీలియా పోటోలను ఉపయోగించుకొని ఆ కంపెనీ చాలా యాడ్స్ ఇచ్చి ప్లాట్స్ అన్నీ అమ్ముకున్నాక బోర్డు తిప్పేసింది. దీంతో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జెనీలియా ఆ వ్యవహారంలో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.