
will abhi listen to Gayathri and leave Tulasi house in intinti gruhalakshmi
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సోమవారం ఎపిసోడ్ 18 ఏప్రిల్ 2022, 608 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు కాబట్టే తను ఇక్కడికి వచ్చింది అని అంకితకు నచ్చజెప్పబోతుంది తులసి. కానీ.. అంకిత మాత్రం వినదు. నేను ఈ ఇంట్లో మనిషిని. అంతే కానీ.. ఈ ఇంట్లో ఉన్న తన మనిషిని కాదు. తను వచ్చి నా ఒక్కదాని కడుపు నింపుతానంటే నేను ఎలా ఊరుకుంటాను అంటుంది అంకిత. దీంతో ఇదే మాట మెల్లగా చెప్పొచ్చు కదా అంటుంది తులసి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను చెప్పండి. ఎవరైనా మీ అత్తామామలను ఏదైనా మాట అంటే ఊరుకుంటారా అంటుంది అంకిత.
will abhi listen to Gayathri and leave Tulasi house in intinti gruhalakshmi
అలా మొండిగా ఉంటే మీ అమ్మకు శాశ్వతంగా దూరం అవుతావమ్మా అంటుంది తులసి. నా కారణంగా అంకిత పుట్టింటికి దూరం అవుతోంది. ప్రేమ్ లాగానే.. అంకితకు కూడా నేను బలహీనంగా మారానా అని తనలో అనుకుంటుంది తులసి. నన్ను కూడా ఇంట్లో నుంచి పంపించేస్తారా ఆంటి అంటుంది అంకిత. దీంతో అదేం లేదమ్మా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు అంటుంది తులసి. ఇంతలో తులసి తల్లి వస్తుంది. దీంతో తులసి చాలా సంతోషిస్తుంది. కాసేపు తులసి తన తల్లితో ఏకాంతంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్తుంది.
మరోవైపు అనుకున్న సమయానికి పాట మొత్తం కావాల్సిందే అని మ్యూజిక్ డైరెక్టర్ కు డైరెక్టర్ చెబుతాడు. దీంతో ఏం చేయాలో బప్పిల హరికి అర్థం కాదు. కానీ.. డైరెక్టర్ మాత్రం రేపు ఉదయం కల్లా పాట కావాలని ఫోర్స్ చేస్తాడు. దీంతో తల పట్టుకొని కూర్చుంటాడు బప్పిల హరి.
అక్కడే ఉన్న ప్రేమ్.. తను పాట రాస్తానని అంటాడు. కానీ.. ప్రేమ్ ను పెద్దగా పట్టించుకోడు మ్యూజిక్ డైరెక్టర్. సార్.. మీరు నాకు ఒక్క చాన్స్ ఇచ్చి చూడండి. సిచ్యుయేషన్ చెప్పండి. నేను పాట రాస్తాను అంటాడు ప్రేమ్. కానీ.. మ్యూజిక్ డైరెక్టర్ పట్టించుకోడు.
ఆ తర్వాత సిచ్యుయేషన్ చెప్పి రేపటి లోగా పాట రాయకపోతే.. మళ్లీ నాకు నీ ముఖం చూపించకు అంటాడు. ఆ తర్వాత తులసి, తన తల్లి ఇద్దరూ కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నేను వెళ్తా అని చెబుతుంది తన తల్లి.
మరోవైపు అంకిత తల్లి గాయత్రి.. అభిని కలుస్తుంది. నువ్వు, నా కూతురు అంకిత.. ఇద్దరూ ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేయండి అంటుంది. తమ ఇంటికి వచ్చేయాలని అంటుంది. కానీ.. అభి కుదరదు అంటాడు. నాకు ఒక్కగానొక్క కూతురు.. దాని కోసం ఏం చేయలేకపోతున్నాను అని వాపోతుంది గాయత్రి.
ఈ సమస్యకు పరిష్కారం లేదు ఆంటి అంటాడు అభి. దీంతో పరిష్కారం ఉంది అంటుంది గాయత్రి. మీ ఇంటికి రావడం అస్సలు కుదరదు ఆంటి. కిందటి సారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చేసిన అవమానాలు నాకు ఇంకా గుర్తున్నాయి అంటాడు అభి.
దీంతో అంకిత పేరు మీద త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాను. ఇవే ఆ ఫ్లాట్ కీస్ అంటుంది గాయత్రి. వాటిని తీసుకొని వెళ్లి ఇద్దరూ అందులో ఉండండి అంటుంది. కట్ చేస్తే దివ్య దగ్గరకు వెళ్లిన నందు.. కాలేజీ నుంచి ఫోన్ వచ్చిందని.. పేరెంట్స్ మీటింగ్ ఉంది రావాలని చెప్పారని అంటాడు.
కానీ.. తులసి మాత్రం మీరు అవసరం లేదు నేను వెళ్తాను అంటుంది. దివ్య బాధ్యత నాది.. కేవలం నాది అంటుంది. శ్రమ పడి మీరు పేరెంట్స్ మీటింగ్ కు రానక్కర్లేదు అంటుంది తులసి. దీంతో నేను దివ్య తండ్రిని. అయినా నాకు కావాల్సింది మీ నిర్ణయం కాదు.. దివ్య ఒపినియన్ అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.