Charmy Cour: ఛార్మీ కౌర్‌లో ఇంకా మెరుపులు తగ్గలేదు. నీతోడు కావాలి సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది బూరె బుగ్గల అమ్మడు. మొదటి సినిమాతో పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన దీపక్ అడ్రస్ లేకుండా పోయినప్పటికీ ఛార్మీ మాత్రం ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఛార్మీ కెరీర్‌లో హీరోయిన్‌గా నటించిన సినిమాలలో ఫ్లాప్స్ ఎక్కువున్నాయి. అయినా కూడా అమ్మడికి మంచి అవకాశాలే దక్కాయి. నటన పరంగా ఛార్మీని ఏ రకంగా కూడా వంక పెట్టాల్సిన పని లేదు. బొద్దుగా ఉన్నా అద్బుతంగా డాన్స్ చేస్తుంది.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేసిన ఛార్మీకి ఫ్లాప్స్ వచ్చాయి. ఆయన దర్శకత్వంలో శ్రీ ఆంజనేయం, చక్రం, రాఖీ చిత్రాలు చేసింది. వీటిలో రాఖీ బ్లాక్ బస్టర్ కాగా, మిగతా రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇక వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జున, సిద్దార్థ్, ప్రభాస్, ఎన్.టి.ఆర్ లాంటి స్టార్స్ సరసన నటించి హిట్స్ అందుకుంది. దాదాపు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో 15ఏళ్ళు కొనసాగింది. జ్యోతిలక్ష్మీ సినిమాతో హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారింది. తెలుగులో సేవకుడు తర్వాత పూర్తిగా నటించడం మానేసిన ఛార్మీ నిర్మాతగా కొనసాగుతోంది.
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పతాకంపై భారీ చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. లైగర్, జనగణమన చిత్రాలకు ఛార్మీ కూడా ఓ నిర్మాత. అయితే, ఆమె ఎక్కడ కనిపించినా కూడా ఇంకా మనవాళ్ళు హీరోయిన్‌గానే చూస్తున్నారు. మళ్ళీ తన తళుకులను మెరుపులను వెండితెర మీద చూడాలనుకుంటున్నారు. ఇప్పటికీ తరగని అందంతో ఛార్మీ అభిమానులను ఆకట్టుకుంటోంది. అందుకే, ఎంతో మంది అభిమానులు మా కోసం ఒక్క సినిమాలో హీరోయిన్‌గా చేయమని కోరుకుంటున్నారు. కాని, ఎందుకనో ఛార్మీ నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. మరి పూరి సార్ అయినా ఒప్పించి ఆయన తీసే సినిమాలో అయినా తన అందాలను చూపిస్తారేమో చూడాలి. మళ్ళీ ఛార్మీ సిల్వర్ స్క్రీన్ మీద మెరిస్తే మాత్రం అభిమానుల్లో ఉత్సాహం అంతా ఇంతా ఉండదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.