KGF 2 Movie First Day Collections
KGF 2 Movie First Day Collections : ప్రస్తుతం కేజీయఫ్ 2 స్పీడు చూస్తుంటే ఈ సినిమా బాలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లోనూ దుమ్ములేపే కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. యశ్ అదిరిపోయే నటనకు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి ప్రేక్షకులు.. సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేజీఎఫ్ కంటే చాప్టర్ 2 అంతకు మించి అన్నట్టుగా థియేటర్లలో దూసుకుపోతూండటం విశేషం. విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది.
కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన చిత్రం ‘కేజీఎఫ్’. అప్పటివరకు కన్నడ సినిమాలను ఇతర ఇండస్ట్రీ వాళ్లు అంతగా పట్టించుకులేదు. అలాంటి సమయంలో రిలీజైన కేజీఎఫ్ చిత్రంతో అందరూ కన్నడ ఇండస్ట్రీ గురించి చర్చింకున్నారు. ఎలాంటి అంచనాల్లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతి ఏరియాలో వసూళ్ల సునామీని సృష్టించింది. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో కేజీఎఫ్ చిత్రం బాలీవుడ్‌లో జెండా పాతింది. ఇండియన్ సినిమాలో అలాంటి ఎలివేషన్‌లు ఎక్కడా చూడలేదు. ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, విజన్‌కు సినీప్రముఖులు సైతం అశ్చర్యంలో పడ్డారు. అప్పటివరకు అసలు మొహం కూడా తెలియని యష్ ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ చిత్రంలో యష్ నటన, ఆటిట్యూడ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
KGF 2 Movie First Day Collections
కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 50 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే.. తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ 2 మూవీ రూ. 33 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం కలిపి రూ. 50 కోట్లు వసూలు చేసిందట. మొత్తానికి దేశవ్యాప్తంగా కేజీఎఫ్ 2 కలెక్షన్స్ రూ.130 కోట్లు.. అంటే రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, రావు రమేష్, రవినా టాండన్, కీలకపాత్రలలో నటించారు. గరుడను చంపిన రాకీభాయ్‌గా, ఫస్ట్ పార్ట్ లో చూపించిన సేమ్ మేనరిజమ్, సేమ్ డైలాగ్ డెలివరీతో మాస్‌లో ఫైర్ పుట్టించే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు యశ్.
Tax Payers : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పన్ను రిటర్న్ విషయంపై గుడ్ న్యూస్ అందించింది. ఐటీఆర్…
Pushpa Movie Shekhawat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ వైవిధ్యమైన సినిమాలతో…
Ram Charan - Trivikram : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ భారీ సోషియో…
Kavitha : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ అంతర్గతంగా విభేదాలు…
Today Gold Price : మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. పండుగలు,పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాలు వంటి శుభకార్యాల…
Best Foods Before Bed : మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రపోతున్నప్పుడు, మీ…
Kiwi Skin : కివి తొక్క పూర్తిగా తినదగినది. విషపూరిత రసాయనాలు ఉండవు. ఇందులో ఫ్లేవనాయిడ్లు, కరగని ఫైబర్స్, యాంటీ…
Karthika Deepam - 2 : కార్తీక దీపం - 2 సీరియల్ నేటి (మే 28, 2025) ఎపిసోడ్లో…
This website uses cookies.