
will janaki and rama clear route for vennela and dilip marriage
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 21 ఫిబ్రవరి 2022, ఎపిసోడ్ 241 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబను ఎలాగోలా వెన్నెల పెళ్లి విషయంలో దిలీప్ తో పెళ్ల జరిపించేలా ఒప్పిస్తారు. దిలీప్ తమ దూరపు బంధువు అని.. వాళ్ల దగ్గరికి వెళ్లి ఒకసారి మాట్లాడాలని చెబుతుంది జానకి. దీంతో మీరిద్దరు వెళ్లి మాట్లాడి రండి అని చెబుతుంది జ్ఞానాంబ. దీంతో జానకి ఊపిరిపీల్చుకుంటుంది. తర్వాత తమ రూమ్ లోకి వెళ్లి సేద తీరుతారు జానకి, రామా. అత్తయ్య గారు ఇంత తొందరగా ఒప్పుకుంటారని అనుకోలేదు అంటుంది జానకి. రామా కూడా అదే అంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు అంటుంది జానకి. కానీ.. నాకు మాత్రం ప్రశాంతంగా లేదు అంటాడు రామా. దీంతో జానకి షాక్ అవుతుంది.
will janaki and rama clear route for vennela and dilip marriage
మళ్లీ బుంగ మూతి పెడతాడు రామా. తన చదువు విషయాన్ని మరోసారి గుర్తు చేస్తాడు. దీంతో జానకికి కోపం వస్తుంది. మీకు ఎన్నిసార్లు చెప్పాను. మళ్లీ నా చదువు విషయం తీసుకురావద్దని అంటుంది జానకి. కానీ.. రామా మాత్రం వినడు. ఇంకెప్పుడు మీరు నా చదువు విషయం గురించి ప్రస్తావన తీసుకురావద్దు అంటుంది జానకి. కానీ.. రామా మాత్రం వినడు. ఏమండోయ్ శ్రీవారు. రేపు వాలెంటైన్స్ డే. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది.. రేపు ఎలా ప్రేమించుకోవాలా అని అంటుంది. కానీ.. రామా మాత్రం మనమేమీ ప్రేమికులం కాదు. మనది ప్రేమ పెళ్లి కాదు అంటాడు. అయ్యో రామా గారు.. పెళ్లి తర్వాత ప్రేమించుకోకూడదని ఎక్కడా రూల్ లేదు కదా.. అని చెప్పి రామాను కూల్ చేస్తుంది.
రాత్రి కాగానే అందరూ పడుకుంటారు. రామా మాత్రం వైట్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతాడు. వెళ్లి జానకిని లేపుతాడు. రెడీ అవ్వమని చెబుతాడు. ఒక చీర ఇస్తాడు. ఆ చీర కట్టుకొని వచ్చాక.. జానకిని ఒక ప్లేస్ కు తీసుకెళ్తాడు. అక్కడ వాలెంటైన్స్ డే సందర్భంగా జానకి కోసం డెకరేట్ చేపిస్తాడు. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను అక్కడ సెట్ చేస్తాడు. ఆ డెకరేషన్ ను చూసి జానకి షాక్ అవుతుంది.
చాలా సంతోషిస్తుంది. ఫోటోలను చూసి మురిసిపోతుంది. దీంతో జానకి గారు.. ప్రతి ఫోటోలోను మీరు చాలా సంతోషంగా.. చాలా బాగా నవ్వుతూ ఉన్నారు కదా అంటాడు రామా. దీంతో అవును రామా గారు. ఈ సంతోషం.. నవ్వు మీరే ఇచ్చారు. నవ్వడం మరిచిపోయిన నన్ను తిరిగి నవ్వేలా చేశారు అంటుంది జానకి.
నా జీవితం ముగిసిపోయింది అని బాధపడుతున్న సమయంలో కొత్త జీవితాన్ని పరిచయం చేశారు అంటుంది జానకి. మరి.. ఈ ఫోటోలో మాత్రం ఎందుకు నవ్వడం లేదు అని అడుగుతాడు రామా. దీంతో ఏంటా ఫోటో అని వెళ్లి చూస్తుంది జానకి. అది తన పెళ్లినాటి ఫోటో.
పెళ్లి అనేది ప్రతి ఆడపిల్లకు ఒక అందమైన కల అంటారు. అలా పెళ్లి జరుగుతున్నప్పుడు కళకళలాడాల్సిన మీ మొహం ఎందుకు దిగులుగా.. బాధగా ఉంది అని అడుగుతాడు రామా. నేను చెబుతాను.. ఇందుకు కూడా కారణం నేనే అంటాడు రామా.
పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్నా.. మీ మొహంలో సంతోషం దూరమై.. బాధ రావడానికి కారణం నేనే అంటాడు రమా. దీంతో అదేం కాదు రామా గారు. మీరసరు కారణం కాదు అంటుంది జానకి. ఐపీఎస్ అవ్వాలనేది మీ కల. ఆ కలను అందుకోకుండానే బలవంతంగా పెళ్లి చేస్తున్నారనేది బాధ.
మరి నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే.. మీకు ఇష్టమైన ఐపీఎస్ వైపు అడుగులు వేస్తూ ఉండేవారు జానకి గారు.. అంటాడు రామా. మరి.. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా.. మీకు ఇంత బాధ అంటాడు రామా. అదేం లేదు రామా గారు అంటుంది జానకి.
మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం కాబట్టే.. ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అంటుంది జానకి. మరి.. ఇప్పుడెందుకు ఐపీఎస్ చదువును వదిలేశారు. ఇంకెప్పుడూ ఐపీఎస్ మాటను వదిలేయనని నాకు మాటివ్వండి. ఈ మాటతో ఈ ప్రేమికుల రోజును నాకు కూడా ఆనందంగా ఉండేలా చేయండి.. ఇంకెప్పుడూ ఐపీఎస్ చదువును వదిలేయనని నాకు మాటివ్వండి అని అడుగుతాడు రామా.
దీంతో జానకి షాక్ అవుతుంది. తనకు ఏం చేయాలో అర్థం కాదు. మరో వైపు రాజా వారు డబ్బులు ఇచ్చారు. వెళ్లి లాకర్ లో పెట్టు అని రామాతో జ్ఞానాంబ అంటుంది. దీంతో సరే అమ్మ అంటాడు రామా. అయితే.. అదే లాకర్ లో జానకి సర్టిఫికెట్లు కూడా ఉంటాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.