Janaki Kalaganaledu : వెన్నెల ప్రేమించింది దిలీప్ నే అని తెలుసుకొని నిశ్చితార్థం ఆపించిన జ్ఞానాంబ.. జానకికి మైరావతి వేసిన శిక్షకు రామా షాక్

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 18 మార్చి 2022, ఎపిసోడ్ 260 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓవైపు నిశ్చితార్థం జరుగుతుండగా.. మరోవైపు జానకితో అర్జెంట్ గా మాట్లాడాలని చెప్పి మల్లిక.. జానకిని లోపలికి పిలుస్తుంది. వెన్నెల, దిలీప్ ప్రేమ గురించి నాకు అంతా తెలుసు. ఇక నీ ఆటలు ఆపేయ్. నీ నాటకాలు ఆపేయ్ అంటూ జానకికి షాక్ ఇస్తుంది. దీంతో జానకి ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు నీకు ఉన్నది రెండే రెండు ఆప్షన్స్. ఒకటి నువ్వు వెళ్లి ఈ నిశ్చితార్థాన్ని ఆపేయడం.. రెండోది నేనే అసలు విషయం చెప్పి ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తా అంటుంది మల్లిక. ఒకవేళ నీ అంతట నువ్వే ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తే నీకే మంచిది. ఇప్పటికైనా నువ్వు నీ తప్పు తెలుసుకున్నావని అనుకుంటారు.

will jnanamba know the truth behind vennela and dilip marriage

అదే.. నేను చెప్పాననుకో… ఆ పోలేరమ్మ.. ఇటు మాంకాలమ్మా నిన్ను జన్మలో క్షమించరు.. అని చెబుతుంది. దీంతో జానకికి ఏంచేయాలో అర్థం కాదు. ఇంతలో పెళ్లి తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఉంగరాలు మార్చుకోండి అని చెబుతాడు పంతులు. దీంతో జానకి కోసం చూస్తుంది జ్ఞానాంబ. జానకి అని పిలుస్తుంది.. లోపల ఉన్న జానకి.. వస్తున్న అత్తయ్య గారు అంటుంది. జానకిని ఉంగరాలు తీసుకొనిరా అంటుంది జ్ఞానాంబ. ఉంగరాలు తీసుకొస్తుంది కానీ.. తనకు ఇవ్వడానికి ధైర్యం సరిపోదు. దీంతో ఆ ఉంగరాలను తీసుకొని రామా.. జ్ఞానాంబకు ఇస్తాడు.

దీంతో వెన్నెల ఉంగరం తీసుకొని దిలీప్ కు తొగడబోతుంది. ఇంతలో మల్లిక వచ్చి ఆగు వెన్నెల అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. మా అత్తయ్య జ్ఞాన ప్రసుమాంబ గారి పరువు కాపాడుదామని ఆపమని చెప్పా అంటుంది. ఆమె ముద్దుల కోడలు జానకి ఆమె పరువు తీయకుండా ఆపుదామని ఆపాను అంటుంది మల్లిక.

దీంతో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు.. జానకితో పాటు మీ పెద్ద కొడుకు, వెన్నెల అందరూ కలిసి పెద్ద గూడుపుఠాణీ చేశారండి అని చెబుతుంది మల్లిక.

మిమ్మల్ని పిచ్చోళ్లను చేశారు అంటుంది మల్లిక. వెన్నెల ప్రేమించింది ఎవరినో కాదు.. దిలీప్ నే అంటుంది మల్లిక. దీంతో అందరూ షాక్ అవుతారు. మీ అన్నయ్య, జానకి, వెన్నెల కలిసి.. వీళ్ల ప్రేమను పెద్దలు కుదిర్చిన పెళ్లిగా మార్చారు. ఈ నాటకంలో వాళ్లను కూడా పాత్రదారులను చేశారు అని అంటుంది మల్లిక.

Janaki Kalaganaledu : జానకిని పక్కకు తీసుకెళ్లి ప్రశ్నించిన జ్ఞానాంబ

కావాలంటే వాళ్లనూ అడగండి.. అప్పుడే నిజం ఏంటో తెలుస్తుంది అంటుంది మల్లిక. దీంతో అందరూ షాక్ అవుతారు. ఎవరో ఎందుకు.. మీ పెద్ద కోడలునే అడగమనండి. అత్తయ్య గారి మీద ఒట్టు పెట్టి నిజమేంటో చెప్పమనండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే.. ఇక్కడ ఉన్న అందరి చెప్పులతో పటా పటా కొట్టించుకుంటాను నేను అంటుంది మల్లిక.

నాకెందుకో నమ్మకం కుదరడం లేదు అంటుంది జ్ఞానాంబ. తను ఎప్పుడూ మన కుటుంబం పరువు కోసమే ఆరాటపడుతుంది అంటుంది జ్ఞానాంబ. ఇక లాభం లేదనుకొని.. జానకిని పక్కకు తీసుకెళ్తుంది జ్ఞానాంబ. వెన్నెల కోసం నువ్వు మంచి సంబంధం చూశావని చెప్పగానే నా బాధ్యత నువ్వు తీసుకున్నావని నేను చాలా సంతోషించాను అంటుంది జ్ఞానాంబ.

కానీ ఇదంతా నాటకం అని మల్లిక చెబుతుంటే నమ్మలేకపోయాను అంటుంది జ్ఞానాంబ. జానకి నువ్వు పెద్ద కోడలుగానే కాదు.. నా కూతురు లాంటి దానివి. చెప్పు జానకి. మల్లిక చెప్పింది అబద్ధం అని చెప్పు అని అడుగుతుంది జ్ఞానాంబ. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టను అని చెప్పు అంటుంది జ్ఞానాంబ.

అంటే.. మల్లిక మాట్లాడింది నిజమా అంటుంది. జానకి చేసిన మోసాన్ని జ్ఞానాంబ తట్టుకోలేకపోతుంది. అత్తయ్య గారు ఆరోజు మీరు చెబితే నేను వినలేదు. ఈరోజు తన విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదు అంటుంది జ్ఞానాంబ.

ఈ సమస్యను, మోసం చేసిన వాళ్లను మీ దగ్గరే వదిలేసి వెళ్తున్నాను. ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఎలాంటి శిక్ష వేస్తారో మీ ఇష్టం అని చెప్పి మైరావతి కాళ్లకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. నువ్వు చేసిన తప్పుకు ఏ శిక్ష వేసినా తప్పులేదు అంటుంది మైరావతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago