Home » Entertainment » Will Madhuri Escape Death In Janaki Kalaganaledu
Entertainment

Janaki Kalaganaledu : మాధురి చనిపోతే అఖిల్ పరిస్థితి ఏంటి? జీవితాంతం జైలులోనే.. జానకి వల్లే అఖిల్ జైలుకు వెళ్లాడని జ్ఞానాంబ ఏం చేస్తుంది?

Authored By
Varun G
The Telugu News | Updated on: November 6, 2022, 9:04 am
Advertisement

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 7 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 426 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మాధురిని ఆసుపత్రిలో చేర్పించిన జానకి వాళ్ల పేరెంట్స్ కు ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. దీంతో వాళ్లు కంగారు పడుతూ ఆసుపత్రికి వస్తారు. ఓ వ్యక్తి మాధురి తల మీద కొట్టాడని చెబుతుంది. ట్రీట్ మెంట్ జరుగుతోందని చెబుతుంది. డాక్టర్లు కూడా మాధురి బతకడం కష్టం అని చెబుతారు. అసలు అఖిల్ ఎందుకిలా చేశాడు. ముందు అఖిల్ ను ఎందుకు ఇలా చేశాడో అడిగి తెలుసుకొని ఆ తర్వాత ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని అనుకుంటుంది.

Advertisement

will madhuri escape death in janaki kalaganaledu

మరోవైపు రాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదని ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఫోన్ చేసినా కూడా తీయడం లేదని రామా చెబుతాడు. దీంతో ఇంట్లో వాళ్లకు టెన్షన్ ఇంకా ఎక్కువవుతుంది. ఇంతలో జానకి వస్తుంది. తను దీనంగా ఉండటం చూసి రామా షాక్ అవుతాడు. ఏమైంది జానకి ఎందుకు లేట్ అయింది అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో స్టడీ మెటీరియల్ కొనడానికి వెళ్లినందుకు లేట్ అయింది. లేట్ అవుతుందని చెప్పనందుకు సారీ అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది జానకి. ఆ తర్వాత రామా రూమ్ లోకి వెళ్లి ఏమైంది జానకి గారు. ఎందుకు అంత డల్ గా ఉన్నారు అని అడుగుతాడు. దీంతో ఏం లేదు అంటుంది జానకి.

Advertisement

కానీ.. రామాకు మాత్రం ఏదో అనుమానం వస్తుంది. ఇప్పుడే రామా గారికి మాధురి విషయం చెప్పాలా వద్దా అని అనుకుంటుంది జానకి. అసలు అఖిల్ తో మాట్లాడాక ఏం జరిగిందో అప్పుడు అర్థం అవుతుంది. ఆ తర్వాతే అందరికీ చెప్పాలి అని అనుకుంటుంది జానకి.

Janaki Kalaganaledu : మంచోడిలా మారానని ఇంట్లో వాళ్లను నమ్మించబోయిన అఖిల్

మరోవైపు అఖిల్.. మాధురిని తను చంపేసిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మంచోడిలా చదువుతున్నట్టు నటిస్తాడు. పుస్తకాలు పట్టుకొని చదువుకోవడానికి వెళ్లబోతాడు. ఇంతలో అక్కడికి జెస్సీ వస్తుంది.

Advertisement

ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది జెస్సీ. దీంతో చదువుకోవడానికి. నేను మారాను అంటాడు. దీంతో జెస్సీ సంతోషిస్తుంది. ఇంతలో జానకి అవన్నీ వింటుంది. ఓవైపు మాధురిని ఆసుపత్రిలో చేరేలా చేసి ఇక్కడ మంచోడిలా నటిస్తున్నాడు అని అనుకుంటుంది.

అఖిల్ దగ్గరికి వెళ్లిన జానకి.. ఏమైంది అఖిల్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది జానకి. దీంతో చదువుకుంటాను ఇక. బాధ్యతగా ఉంటాను వదిన అంటాడు అఖిల్. దీంతో అఖిల్ తో మాధురి గురించి మాట్లాడాలని అనుకొని జెస్సీని అఖిల్ కు చాయ్ పెట్టు అని అక్కడి నుంచి కిచెన్ లోకి పంపిస్తుంది.

జెస్సీ వెళ్లాక అఖిల్ తో నీకోసం ఎవరో వచ్చారు. బయట వెయిట్ చేస్తున్నారు అని అంటుంది జానకి. దీంతో మాధురి విషయం ఎవరికైనా తెలిసిందా అని టెన్షన్ పడుతూ బయటికి వెళ్తాడు. కానీ.. అక్కడ ఎవరూ ఉండరు. దీంతో షాక్ అవుతాడు అఖిల్.

ఇంతలో బయటికి వచ్చిన జానకి నీకోసం ఎవరూ రాలేదు అంటుంది. మాధురి ఎవరు అని అడుగుతుంది. మాధురిని ఎందుకు అలా కొట్టావు అని అడగడంతో అఖిల్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి