Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. కార్తీక దీపం సీరియల్ 7 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 1502 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆనంద రావు శౌర్యను చాలా బతిమిలాడుతాడు. ఇంటికి వెళ్దాం పదా అంటాడు కానీ.. అస్సలు శౌర్య వినదు. నేను రానంటే రాను అంటుంది. దీంతో ఆనంద రావుకు ఏం చేయాలో అర్థం కావు. హిమ చెప్పినా కూడా శౌర్య వినదు. నానమ్మకు కూడా చెప్పండి నేను రానన్నానని అంటుంది శౌర్య. మరోవైపు మీవల్లే శౌర్య ఇలా మారిపోయిందని అంతా మీరే చేశారని ఇంద్రుడు, చంద్రమ్మ మీద విరుచుకుపడతాడు ఆనంద రావు. నువ్వు వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాం. ఇదిగో ఖర్చులకు ఉంచు అని ఇంద్రుడుకు డబ్బులు ఇస్తాడు ఆనందరావు.
మరోవైపు దీప దగ్గరికి వస్తుంది మోనిత. ఏంటి మళ్లీ వచ్చావు అని అడుగుతుంది దీప. దీంతో నేను ఇప్పుడు నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు కానీ.. నీకు ఇక్కడ తెలిసిన ఆటో డ్రైవర్లు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. నాకు ఆటోడ్రైవర్ తెలిస్తే నీకు ఎందుకు. అసలు ఆటో డ్రైవర్ల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నిస్తుంది దీప. ఎవరైనా ఆటో డ్రైవర్ తెలుసా చెప్పు అని రిక్వెస్ట్ చేస్తుంది మోనిత. కానీ.. దీపకు డౌట్ వస్తుంది. ఇంద్రుడుతో తాను మాట్లాడుతున్న విషయం తెలిసిందా అని షాక్ అవుతుంది.
ఎంత చెప్పినా ఇంద్రుడు గురించి చెప్పదు. దీంతో మోనిత కోపంతో అక్కడి నంచి వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ కూడా మోనిత గురించే ఆలోచిస్తుంటాడు. మోనితకు ఒకవేళ ఇంద్రుడు గురించి తెలిసిందా. ఇంద్రుడు, మోనిత కలిసే ఈ నాటకం ఆడుతున్నారా అని అనుకుంటాడు కార్తీక్.
ఒకవేళ ఇంద్రుడు, మోనిత కలిసే శౌర్యను తమకు కనిపించకుండా చేస్తున్నారా అని అనుకుంటాడు. ఇంతలో మోనిత వస్తుంది. దుర్గ కూడా వచ్చి బిర్యానీ తెచ్చాను తిందాం పదా అంటాడు.
దీంతో అసలు నిన్నెవరు బిర్యానీ తెమ్మన్నారు అని విరుచుకుపడుతుంది మోనిత. నువ్వే కదా బంగారం తెమ్మన్నావు. అప్పుడే మరిచిపోయావా అంటాడు. దీంతో కార్తీక్ కు కోపం వచ్చి అక్కడినుంచి వెళ్లిపోతాడు.
మరోవైపు ఇంద్రుడు, మోనిత ఇద్దరి మీద శౌర్య గురించి నాకు డౌట్ ఉందని దీపతో చెబుతాడు కార్తీక్. పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటాడు కార్తీక్.
దీంతో మోనిత కూడా నన్ను వచ్చి ఆటో డ్రైవర్ గురించి అడిగింది అంటుంది దీప. ఇంద్రుడు గురించే అడిగినట్టుగా అనిపిస్తోంది అంటుంది దీప. మరోవైపు శౌర్యను తీసుకొని కారులో హైదరాబాద్ కు బయలుదేరుతాడు ఆనంద రావు.
నడుచుకుంటూ వెళ్తున్న దీప, కార్తీక్ కు శౌర్య వాయిస్ వినిపిస్తుంది. కారులో ఉన్నది శౌర్యే అని అంటుంది దీప. దీంతో కార్తీక్, దీప ఆ కారు వెంబడిస్తారు. మరోవైపు ఇంద్రుడు కూడా ఆటోలో కారును వెంబడిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.