Gautham : గౌతమ్ హీరోగా డెబ్యూ సినిమాలో.. ఇందులో మ‌హేష్ బాబు కూడా న‌టిస్తాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gautham : గౌతమ్ హీరోగా డెబ్యూ సినిమాలో.. ఇందులో మ‌హేష్ బాబు కూడా న‌టిస్తాడా..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 March 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Gautham : గౌతమ్ హీరోగా డెబ్యూ సినిమాలో.. ఇందులో మ‌హేష్ బాబు కూడా న‌టిస్తాడా..!

Gautham : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమత్ర శిరోద్కర్ ముద్దుల కొడుకు గౌత‌మ్ ఘ‌ట్ట‌మనేని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గౌత‌మ్ సాధించిన ఘ‌న‌త‌ల ప‌ట్ల మ‌హేష్ ఫుల్ ఎమోష‌న‌ల్ అవుతుంటాడు. ఆ మ‌ధ్య గౌతమ్​ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్(ఇంటర్) పూర్తి చేసిన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు మహేశ్. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారాయన. గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న మహేశ్.. ‘నా మనసు గర్వంతో నిండిపోయింది అని అన్నాడు.

Gautham గౌతమ్ హీరోగా డెబ్యూ సినిమాలో ఇందులో మ‌హేష్ బాబు కూడా న‌టిస్తాడా

Gautham : గౌతమ్ హీరోగా డెబ్యూ సినిమాలో.. ఇందులో మ‌హేష్ బాబు కూడా న‌టిస్తాడా..!

Gautham ఇది నిజ‌మా..!

నీ కలలను ఎప్పుడు వదులుకోకు. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటామన్న విషయాన్ని అసలు మర్చిపోకు. ఈరోజు నేను ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నాను’ అంటూ అనందానికి అక్షర రూపమిచ్చాడు మహేశ్. ఇక ఇప్పుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతుండ‌గా, ఇందులో మ‌హేష్ ఓ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

మ‌హేష్ డెబ్యూ మూవీ రాజ‌కుమారుడులో కృష్ణ.. మ‌హేష్‌కి తండ్రిగా న‌టించాడు.ఈ సినిమా సూప‌ర్ డూపర్ హిట్ కావ‌డ‌మే కాక ఆయ‌న కెరియ‌ర్‌కి ప్ల‌స్ అయింది. ఆ సినిమాలో కృష్ణ న‌టించ‌డం వ‌ల్ల‌నే మూవీ అంత పెద్ద హిట్ అయింద‌ని న‌మ్ముతారు. ఇప్పుడు గౌత‌మ్ సినిమాలో మ‌హేష్ న‌టిస్తే ఆ చిత్రం కూడా పెద్ద హిట్ అవుతుంద‌ని విశ్వ‌సిస్తున్నారు అభిమానులు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది