Home » Entertainment » Will Mahesh Babu Plans Be A Workout
Entertainment

Mahesh Babu : మహేష్ బాబు ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా..? ఇది పెద్ద రిస్కేమో..

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 23, 2022 11:34 pm
Advertisement

Mahesh Babu : మేజర్ సందీప్ ఉన్నికృష్ణ జీవిత కథ ఆధారంగా మేజర్ సినిమా రూపొందింది. గూడాచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఈ సినిమాలో టైటిల్ పోషించాడు. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ళ కీలక పాత్రలో కనిపించబోతోంది. హిందీ, తెలుగు, మలయాళం భాషలలో జూన్ 3వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. బయోపిక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

ఇక మహేశ్ బాబు ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించడంతో కూడా ప్రాజెక్ట్‌పై భారీగా అంచనాలు పెరగడానికి ముఖ్య కారణం. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం నాన్ స్టాప్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే మేజర్ సినిమాను నిర్మించిన సోనీ వారు మహేశ్ బాబు కలిసి కొత్త ప్లాన్ రచించినట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ కంటే ముందు ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇది సినిమా చరిత్రలోనే మొదటిసారి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఇలాంటి ప్లాన్ అప్లయ్ చేయనేలేదు.

Will Mahesh Babu plans be a workout

Advertisement

Mahesh Babu : ఏఎంబీ సినిమాస్ నందు మేజర్ సినిమా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్..

ఎందుకంటే, ఇలా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ చేస్తే సినిమా టాక్ తేడాగా వస్తే ఇక సినిమా చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ వరకూ రావడం ఆసాధ్యం. కానీ, మహేశ్ బృందం చాలా నమ్మకంగా మేజర్ సినిమాను రిలీజ్‌కు ఒక్కరోజు ముందు సెలెక్టెడ్ థియేటర్స్‌లో ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ చేస్తుండటం ఆసక్తికరం. దేశవ్యాప్తంగా ఉన్న 9 ప్రధాన రాష్ట్రాలలో మేజర్ సినిమా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ చేయనున్నారు. హైదరాబాద్‌లో మహేశ్ బాబు థియేటర్స్ ఏఎంబీ సినిమాస్ నందు మేజర్ సినిమాను రిలీజ్‌కు ముందే స్క్రీనింగ్ చేయనున్నారు. చూడాలి మరి మహేశ్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి