Mahesh Babu : మహేష్ బాబు ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా..? ఇది పెద్ద రిస్కేమో.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu : మహేష్ బాబు ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా..? ఇది పెద్ద రిస్కేమో..

Mahesh Babu : మేజర్ సందీప్ ఉన్నికృష్ణ జీవిత కథ ఆధారంగా మేజర్ సినిమా రూపొందింది. గూడాచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఈ సినిమాలో టైటిల్ పోషించాడు. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ళ కీలక పాత్రలో కనిపించబోతోంది. హిందీ, తెలుగు, మలయాళం భాషలలో జూన్ 3వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. బయోపిక్ కావడంతో ఈ సినిమాపై […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 May 2022,1:00 pm

Mahesh Babu : మేజర్ సందీప్ ఉన్నికృష్ణ జీవిత కథ ఆధారంగా మేజర్ సినిమా రూపొందింది. గూడాచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఈ సినిమాలో టైటిల్ పోషించాడు. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ళ కీలక పాత్రలో కనిపించబోతోంది. హిందీ, తెలుగు, మలయాళం భాషలలో జూన్ 3వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. బయోపిక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక మహేశ్ బాబు ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించడంతో కూడా ప్రాజెక్ట్‌పై భారీగా అంచనాలు పెరగడానికి ముఖ్య కారణం. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం నాన్ స్టాప్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే మేజర్ సినిమాను నిర్మించిన సోనీ వారు మహేశ్ బాబు కలిసి కొత్త ప్లాన్ రచించినట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ కంటే ముందు ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇది సినిమా చరిత్రలోనే మొదటిసారి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఇలాంటి ప్లాన్ అప్లయ్ చేయనేలేదు.

Will Mahesh Babu plans be a workout

Will Mahesh Babu plans be a workout

Mahesh Babu : ఏఎంబీ సినిమాస్ నందు మేజర్ సినిమా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్..

ఎందుకంటే, ఇలా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ చేస్తే సినిమా టాక్ తేడాగా వస్తే ఇక సినిమా చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ వరకూ రావడం ఆసాధ్యం. కానీ, మహేశ్ బృందం చాలా నమ్మకంగా మేజర్ సినిమాను రిలీజ్‌కు ఒక్కరోజు ముందు సెలెక్టెడ్ థియేటర్స్‌లో ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ చేస్తుండటం ఆసక్తికరం. దేశవ్యాప్తంగా ఉన్న 9 ప్రధాన రాష్ట్రాలలో మేజర్ సినిమా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ చేయనున్నారు. హైదరాబాద్‌లో మహేశ్ బాబు థియేటర్స్ ఏఎంబీ సినిమాస్ నందు మేజర్ సినిమాను రిలీజ్‌కు ముందే స్క్రీనింగ్ చేయనున్నారు. చూడాలి మరి మహేశ్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది