Janaki Kalaganaledu : రామా కష్టాలు చూసి జ్ఞానాంబ షాక్.. రామాకు జానకితో విడాకులు ఇప్పిస్తుందా?

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 4 ఏప్రిల్ 2022, 270 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబకు కావాలని అన్నీ ఎక్కించి చెబుతుంది మల్లిక. తన ఫ్రెండ్ వచ్చినప్పుడు రామాకు విడాకులు ఇస్తా అని తనతో అనడం నేను విన్నా అని జ్ఞానాంబకు మల్లిక చెప్పడంతో జ్ఞానాంబ కూడా నిజమే అని నమ్ముతుంది. చదువుకున్నానన్న తెలివి తనలో బాగానే ఉంది కదా. రామా కూడా చదువుకోలేదు. అందుకే.. రామాకు విడాకులు ఇవ్వడానికి జానకి సిద్ధపడటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అని అంటుంది జ్ఞానాంబ.

Will mallika plan succeeded in janaki kalaganaledu

ఆ తర్వాత దండం విషయంలో మల్లిక, జానకి మధ్య గొడవ జరుగుతుంది. జానకి.. దండం మీద తన బట్టలు ఆరేసి వెళ్లగా.. మల్లిక వచ్చి వాళ్ల బట్టలను తీసి కింద పడేస్తుంది. తన బట్టలను ఆ దండం మీద ఆరేసుకుంటూ.. జానకిని విమర్శిస్తుంది. ఇక్కడ ఉండకండి అని చెప్పినా కూడా ఇంకా ఇక్కడే ఉండటం, కనిపించడం ఏంటో. అమ్మో నేనైతే ఒక్క క్షణం కూడా ఉండేదాన్ని కాదు అని అంటుంది మల్లిక. ఇదంతా చూసిన గోవిందరాజు.. వెంటనే వెళ్లి ఒక తాడును తీసుకొచ్చి దండం అక్కడ కట్టి ఇక నుంచి ఇక్కడ నువ్వు బట్టలు ఆరేసుకో అని చెప్పి.. ఆ బట్టలను తీసి ఆరేస్తాడు గోవింద రాజు.

థాంక్యూ మామయ్య గారు అంటుంది జానకి. ఆ తర్వాత డబ్బులు తీసుకో అంటాడు. వద్దు అంటుంది. కొడుకు కష్టాల్లో ఉన్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత తండ్రిగా నాకుందని రామాకు చెబుతానులే.. తీసుకో అంటాడు. నువ్వు తీసుకోకపోతే నేను బాధపడతాను అంటాడు.

ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. తనను చూసి షాక్ అవుతాడు. దీంతో ఇదిగో మీ బట్టలు మీ దండం మీద ఆరేసుకోవాలి. మా దండం మీద ఆరేయకూడదు. ఇదిగో అర్థం అయిందా. మా దండం మీద ఆరేస్తే నేను ఊరుకోను.. అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు గోవిందరాజు.

మరోవైపు ఖార్ఖానాలో అన్నం తినకుండా దాన్ని పడేసి తీసుకొచ్చిన రామాను చూసి బాధపడుతుంది జ్ఞానాంబ. నా కొడుకు ఎన్ని కష్టాలు పడుతున్నాడు. వాడిని ఎలా పెంచుకున్నాను. ఇప్పుడు వాడి బతుకు ఎలా అయింది అని చాలా బాధపడుతుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu : రామాతోనే వంట వండిస్తోందని బాధ పడ్డ జ్ఞానాంబ

రామా ఇలా కడుపు కాల్చుకునే పరిస్థితి రావడానికి.. నాకు కన్నపేగు బాధపడటానికి కారణం ఆ ఒక్క జానకే అని అనుకుంటుంది జ్ఞానాంబ. చివరకు రాత్రి కూడా రామాతో జానకి చపాతీలు చేయించడం చూసి షాక్ అవుతుంది జ్ఞానాంబ.

కానీ.. రామా మాత్రం.. రాత్రి పూట చపాతీలు కాల్చుతూ తన పాత మెమోరీస్ ను గుర్తు తెచ్చుకుంటాడు. తెల్లారాక.. ఖార్ఖానాలో భోజనం చేస్తూ జానకికి ఫోన్ చేస్తాడు. ఈరోజు భోజనం అదిరిపోయింది అని చెబుతాడు. కానీ.. ఆ భోజనాన్ని పంపించింది జానకి కాదు.. జ్ఞానాంబ.

అందుకే.. భోజనం అచ్చం మా అమ్మ చేసిన దానిలా ఉందంటాడు. ఇదంతా అక్కడే ఉండి చూసిన జ్ఞానాంబ.. నాకు తెలుసు రామా.. నువ్వు ఈ అమ్మకు సంబంధించిన దాన్ని ఇట్టే గుర్తుపడతావని. మనిద్దరి మధ్య బంధం దూరం అవ్వడానికి కారణం ఆ జానకి అని అనుకుంటుంది జ్ఞానాంబ.

రానివ్వను నాన్నా.. నా కొడుకుకు అలాంటి పరిస్థితి రానివ్వను. చూస్తూ చూస్తూ… నిన్ను దూరం చేసుకోను. కాపాడుకుంటాను… అని అనుకుంటుంది జ్ఞానాంబ. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Aloevera juice | అలొవెరా జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే.. ఈ స‌మస్య‌లు ఉన్న వారికి మాత్రం ప్ర‌మాదం

Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌‍లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…

5 minutes ago

Vastu Tips | హిందూ మతంలో రావి చెట్టు ప్రాధాన్యం .. ఇంటి గోడలపై పెరిగితే శుభమా, అశుభమా?

Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…

1 hour ago

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

10 hours ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

11 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

12 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

13 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

14 hours ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

15 hours ago