Samantha : చైతూ సామ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇద్దరు మళ్లీ ఒక్కటవబోతున్నారు.. సమంత సిగ్నల్ ఇచ్చేసింది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : చైతూ సామ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇద్దరు మళ్లీ ఒక్కటవబోతున్నారు.. సమంత సిగ్నల్ ఇచ్చేసింది

Samantha : ఇండస్ట్రీ మొత్తం గత సంవత్సరం సమంత, నాగ చైతన్య విడాకుల గురించే చర్చించింది. సరిగ్గా సంవత్సరం క్రితం తామిద్దరం విడాకులు తీసుకోబోతున్నామని చైతే సామ్ ఇన్ స్టా పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఇద్దరూ కలిసి ఒకే నోట్ ను విడుదల చేశారు. ఆ నోట్ ప్రకారం.. తాము విడిపోతున్నట్టు.. విడిపోయినా కూడా ఇద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్ గా మాత్రం ఉంటామని ఆ నోట్ సారాంశం. ఇప్పుడు ఆ నోట్ ను నిజం చేస్తూ తిరిగి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 October 2022,10:30 am

Samantha : ఇండస్ట్రీ మొత్తం గత సంవత్సరం సమంత, నాగ చైతన్య విడాకుల గురించే చర్చించింది. సరిగ్గా సంవత్సరం క్రితం తామిద్దరం విడాకులు తీసుకోబోతున్నామని చైతే సామ్ ఇన్ స్టా పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఇద్దరూ కలిసి ఒకే నోట్ ను విడుదల చేశారు. ఆ నోట్ ప్రకారం.. తాము విడిపోతున్నట్టు.. విడిపోయినా కూడా ఇద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్ గా మాత్రం ఉంటామని ఆ నోట్ సారాంశం. ఇప్పుడు ఆ నోట్ ను నిజం చేస్తూ తిరిగి ప్యాచ్ అప్ అవ్వబోతున్నారని తెలుస్తోంది. నిజానికి వాళ్ల విడాకుల తర్వాత ఇద్దరూ తమ సినిమాల్లో బిజీ అయిపోయారు.

కానీ.. ఇప్పుడు మళ్లీ ఈ జంట కలిసేందుకు ట్రై చేస్తోందట. ఎందుకంటే విడాకుల తర్వాత ఎక్కడ చూసినా.. సమంత చాలా భావోద్వేగంగా కనిపించారు. చైతన్య కూడా తామిద్దరం ఎవరికి వాళ్లం బాగానే ఉన్నామని చెప్పాడు. అయితే.. ఇటీవల సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అది ఒక ఫోటో. టీషర్ట్ మీద యూ విల్ నెవర్ వాక్ ఎలోన్ అని రాసి ఉంది. అంటే.. నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఉండవు.. అని దాని అర్థం. అంటే.. సమంత తిరిగి నాగ చైతన్యతో కలిసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?

will naga chaitanya and samantha patch up again

will naga chaitanya and samantha patch up again

Samantha : సమంత టీషర్ట్ మీద రాసి ఉన్న దాని అర్థం ఏంటి?

తన టీషర్ట్ మీద ఉన్న కోట్స్ మాత్రమే హైలెట్ చేస్తూ సమంత ఎందుకు ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టింది అంటూ నెటిజన్లు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. అంటే.. ఇద్దరూ తిరిగి కలిసే చాన్స్ ఉందంటూ టాలీవుడ్ కోడై కూస్తోంది. ఇక.. ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం సినిమాలో నటిస్తోంది. మరో హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది. ఫుల్ బిజీగా సినిమాల్లో ఉన్నప్పటికీ తిరిగి నాగ చైతన్యతో కలవాలని సమంతకు ఉందనే వార్తలు ప్రస్తుతం ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. చూద్దాం మరి నిజంగానే ఇద్దరూ మళ్లీ కలుస్తారా? అనేది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది