will pawan kalyan attend ali daughter reception in guntur
Ali – Pawan Kalyan : టాలీవుడ్ కమెడియన్ అలీ కూతురు ఫాతిమా పెళ్లి నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అలీ కూతురు పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పెళ్లికి హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. అయితే.. అలీ కూతురు పెళ్లి వేడుకలో మొత్తం డిస్కషన్ అంతా పవన్ కళ్యాణ్ గురించే. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ అలా కూతురు పెళ్లికి వెళ్లలేదు. దానికి కారణం.. ఏంటో తెలియదు కానీ.. ఇద్దరూ చాలా సన్నిహితులు. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ కూడా ఇప్పటిది కాదు. మరి.. అలాంటిది అలీ కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని అంతా చర్చించుకుంటున్నారు.
కేవలం రాజకీయ పరిస్థితుల వల్లనే పవన్ కళ్యాణ్.. ఈ పెళ్లికి హాజరుకాలేదని అంటున్నారు. అలీ.. ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అలీకి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇద్దరూ ఇండస్ట్రీలో కలిసి ఉన్నప్పటికీ.. రాజకీయాల్లో ఇద్దరి భావాలు వేరు కావడం వల్ల పవన్ కళ్యాణ్.. అలీని దూరం పెడుతున్నారా? అనేది అర్థం కావడం లేదు. గుంటూరులోని శ్రీకన్వెన్షన్ లో అలీ కూతురు రిసెప్షన్ వేడుకను రేపు సాయంత్రం నిర్వహించనున్నారు. సీఎం జగన్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
will pawan kalyan attend ali daughter reception in guntur
అయితే.. పెళ్లికి అంటే పవన్ వెళ్లలేదు. కనీసం రిసెప్షన్ వేడుకకు అయినా పవన్ కళ్యాణ్ వెళ్తారా? లేదా? అనేది తెలియదు. ఒకవేళ రిసెప్షన్ కు కూడా పవన్ కళ్యాణ్ వెళ్లకపోతే ఇక ఇద్దరి మధ్య దూరం పెరిగినట్టే అని భావించాలి. కావాలనే పవన్ కళ్యాణ్.. అలీని దూరం పెడుతున్నారని అర్థం చేసుకోవాలి. కనీసం.. తన కూతురు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్లినా కూడా అలీకి పవన్ కళ్యాణ్ అందుబాటులోకి రాలేదనే వార్తలు అప్పట్లో వచ్చాయి. అంటే.. కావాలనే కేవలం రాజకీయాల వల్లనే పవన్ కళ్యాణ్ అలీని దూరం పెడుతున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులను బట్టి స్పష్టమవుతోంది. చూద్దాం మరి రేపు ఏం జరుగుతుందో?
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
This website uses cookies.