Home » Entertainment » Will Prem Win In Singing Competition In Intinti Gruhalakshmi
Entertainment

Intinti Gruhalakshmi : ఫైనల్ రౌండ్ లో ప్రేమ్ కు షాకిచ్చిన జడ్జిలు? ప్రేమ్ గెలవలేదా? రక్షిత్ నే ప్రేక్షకులు గెలిపించారా? లాస్య ప్లాన్ సక్సెస్ అయినట్టేనా?

Authored By
Varun G
The Telugu News | Published on: July 10, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 11 జులై 2022, ఎపిసోడ్ 680 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ గెలవకుండా.. దగ్గు మందును జ్యూస్ లో కలుపుతానని చెబుతుంది లాస్య. మరి.. ఇది నిజంగా పని చేస్తుందా అని అడుగుతుంది భాగ్య. దీంతో ట్రై చేసి చూస్తావా అని అడుగుతుంది లాస్య. వద్దులే అంటుంది భాగ్య. మరోవైపు సింగింగ్ కాంపిటిషన్ స్టార్ట్ అవుతుంది. మరోవైపు జ్యూస్ ఇచ్చే వ్యక్తిని పిలిచి.. తను దగ్గు మందు కలిపిన జ్యూస్ గ్లాస్ ను ఇచ్చి ఈ గ్లాస్ ను ఆ రెడ్ షర్ట్ వేసుకున్న వ్యక్తికి ఇవ్వమని చెబుతుంది లాస్య. దీంతో సరే అని తీసుకెళ్లి అందరికీ జ్యూస్ లు ఇచ్చిన తర్వాత ప్రేమ్ కు లాస్య ఇచ్చిన గ్లాస్ ఇస్తాడు. దీంతో ప్రేమ్ ఆ గ్లాస్ తీసుకొని తాగుతాడు.

Advertisement

will prem win in singing competition in intinti gruhalakshmi

ఆ తర్వాత పార్టిసిపెంట్స్ అందరినీ పిలుస్తారు. పోటీలు ప్రారంభం అవుతాయి. మొదటి పార్టిసిపెంట్ రక్షిత్ వెళ్లి పాట పాడుతాడు. అతడి పాట బాగుందని అందరూ అనుకుంటారు. ఆ తర్వాత ఇంకో అమ్మాయి వెళ్లి పాడుతుంది. ఇంతలో ప్రేమ్ కు కాస్త దగ్గుగా ఉండటంతో ఏమైంది అని వెళ్లి తులసి అడుగుతుంది. దీంతో కాస్త దగ్గుగా ఉందంటాడు. దీంతో వెళ్లి తనకు కొన్ని వేడి నీళ్లు ఇచ్చి తాగమంటుంది. ఆ తర్వాత లవంగం ఇచ్చి అతడిని వేసుకోమంటుంది. ధైర్యంగా వెళ్లి పాట పాడమని చెబుతుంది తులసి. దీంతో పైకి వెళ్లి బాగా పాటపాడుతాడు ప్రేమ్. సెమీ ఫైనల్స్ కు రక్షిత్, ప్రేమ్ ఇద్దరు మాత్రమే వెళ్తారు.

Advertisement

Intinti Gruhalakshmi :  తను తీసుకున్న గోతిలో తానే పడ్డ లాస్య

దగ్గు మందు కలిపిన జ్యూస్ తాగినా కూడా ప్రేమ్ కు ఏం కాలేదు ఏంటి.. అని షాక్ అవుతుంది లాస్య. ఇంతలో తనకు దగ్గు మొదలవుతుంది. దీంతో బయటికి వెళ్తుంది. ఏమైంది నాకు దగ్గొస్తోంది అని అనుకుంటుంది. ఇంతలో భాగ్య కూడా వస్తుంది. ఏమైంది లాస్య అని అడుగుతుంది.

ఇంతలో తులసి అక్కడికి వచ్చి ఏమైందో నేను చెబుతా అని అంటుంది తులసి. దగ్గు మందు వేసిన జ్యూస్ తాగింది నువ్వే అంటుంది. నువ్వు ప్రేమ్ కు పంపించిన గ్లాస్ ను తీసి వేరే గ్లాస్ పెట్టాను. ఈ గ్లాస్ ను మళ్లీ నీకే పంపించేలా చేశా అని అసలు నిజం చెబుతుంది తులసి.

Advertisement

దీంతో లాస్య షాక్ అవుతుంది. ఏం కాదులే.. టెన్షన్ పడకు. నా కొడుకు ఇవాళ గెలవడం నువ్వు చూడాలి. ఇదిగో తులసి ఆకులు తిను.. దగ్గు తగ్గుతుంది అని అంటుంది తులసి. దీంతో తులసి ఆకులను నోట్లో వేసుకుంటుంది లాస్య. మరోవైపు ఫైనల్స్ లో బాగా పాడాలని ప్రేమ్ ను మోటివేట్ చేస్తుంది తులసి.

దీంతో ఫైనల్స్ లో రక్షిత్ పాడిన తర్వాత ప్రేమ్ కూడా బాగా పాడుతాడు. ఇద్దరూ బాగా పాడారని.. కానీ.. ఇద్దరిలో ఒకరిని విన్నర్ గా డిసైడ్ చేయాలని ప్రేక్షకులను కోరుతుంది హోస్ట్. దీంతో అందరూ ఇద్దరిలో తమకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓట్లు వేస్తారు. ఆ తర్వాత విన్నర్ ఎవరో జడ్జిలు ప్రకటిస్తారు. ఇంతకీ విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి