
will rishi forgive gowtham in guppedantha manasu
Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 5 డిసెంబర్ 2022, ఎపిసోడ్ 625 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీ మొహం ఇక చూడను. నీకు నాకు మధ్య ఏం లేదు. మన స్నేహానికి గొప్ప బహుమతి ఇచ్చావురా అంటాడు రిషి. అరెయ్ రిషి అన్నా కూడా వినడు రిషి. అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. దీంతో వసుధారకు కూడా ఏం చేయాలో అర్థం కాదు. గౌతమ్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అసలు నేను ఏం చేశానని వాడు నన్ను ఇంత మోసం చేశాడు అంటాడు రిషి. దీంతో ఇందులో గౌతమ్ తప్పు ఒక్కడిదే కాదు కదా అంటుంది వసుధార. మహీంద్రా సార్ ఈ విషయం చెప్పొద్దని అన్నారేమో అని అంటుంది వసుధార.
will rishi forgive gowtham in guppedantha manasu
దీంతో అంటే ఏంటి నీ అర్థం అని అంటాడు రిషి. కొంచెం శాంతంగా ఆలోచించండి అంటుంది వసుధార. తప్పు జగతి మేడమ్ ది కూడా ఉంది అంటుంది వసుధార. వాళ్లంటే ఏదో కోపం వచ్చి వెళ్లారు. వాళ్లేదో శిక్ష విధించారే అనుకో. గౌతమ్ నాకు శిక్ష విధించడం ఎందుకు అంటాడు రిషి. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావేంటి. వాడు స్నేహానికి ద్రోహం చేశాడు అంటాడు రిషి. ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో మనం విశ్లేషించగలమా అంటుంది వసుధార. వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్. వాడు కూడా నన్ను మోసం చేస్తే ఎలా అంటాడు రిషి. నాకు కోపం వస్తుంది అంటాడు రిషి.
గౌతమ్ సార్ గురించి మీకన్నా ఎక్కువ ఇంకెవరికి తెలుసు చెప్పండి అంటుంది వసుధార. తాను మహీంద్రా సార్ ను కాదని చెబితే మహీంద్రా సార్ కోప్పడతారు కదా.. అంటుంది వసుధార. దీంతో అందుకని నా ముందు నిజం దాచాలా అంటాడు రిషి. దీంతో ఇందులో ముగ్గురిది తప్పు ఉంది. ఒకసారి ఆలోచించండి అంటుంది వసుధార.
వసుధార ఎంత చెప్పినా రిషి మాత్రం వినడు. మరోవైపు దేవయానికి ఏం చేయాలో అర్థం కాదు. వెళ్లిపోయిందనుకున్న జగతి మళ్లీ వచ్చిందని టెన్షన్ పడుతుంది. వసుధారను తన వైపునకు తిప్పుకుంది అని టెన్షన్ పడుతుంది. ఏదో ఒకటి చేయాలి. ఇలా వదిలేయకూడదు అని అనుకుంటుంది.
మరోవైపు రిషి ఇంటికి వెళ్లాక మహీంద్రాతో మాట్లాడటానికి వెళ్తాడు. కానీ.. అతడు పడుకున్నట్టు అనిపిస్తుంది. దీంతో వెళ్లబోతుండగా రిషి లోపలికి రా అంటాడు. ప్రేమ అంటే ఏదీ దాచుకోకపోవడం కదా డాడ్ అంటాడు రిషి. గౌతమ్ ఇంట్లో మీరు ఉన్న విషయం నాకు తెలిసిపోయింది డాడ్ అంటాడు రిషి.
దీంతో రిషి షాక్ అవుతాడు. ఒక్క విషయం చెప్పడానికి, తెలియడానికి చాలా తేడా ఉంటుంది డాడ్ అంటాడు రిషి. మీరు ఎక్కడున్నారని నేను అడగలేదు. మీరు చెప్పలేదు. కానీ.. గౌతమ్ నా ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి ఫ్రెండ్. వాడు కూడా నన్ను మోసం చేశాడు డాడ్ అంటాడు రిషి.
నిజం చెబితే అంటూ.. మహీంద్రా ఏదో చెప్పబోతుండగా నిజాన్ని దాచకండి అంటాడు రిషి. వాడికి సపోర్ట్ చేయకండి అంటాడు. నిజం చెప్పాలి కదా అంటాడు. నా బాధ తగ్గించాలి కదా అంటాడు. ఒక ఫ్రెండ్ గా వాడికి బాధ్యత లేదా అంటాడు. దీంతో రిషి ఈ విషయంలో తప్పు నాది కూడా ఉంది కదా అంటాడు మహీంద్రా.
ఎంత చెప్పినా రిషి వినడు. గౌతమ్ ను క్షమించు అన్నా కూడా వినడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
This website uses cookies.