Home » Entertainment » Will Sourya Finds Hima In Monitha House In Karthika Deepam
Entertainment

Karthika Deepam : శౌర్య కనిపించేవరకు పెళ్లి చేసుకోను అని శపథ చేసిన హిమ.. ఇంతలో హిమకు మరో షాక్

Authored By
Varun G
The Telugu News | Updated on: April 3, 2022, 10:40 am
Advertisement

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 4 ఏప్రిల్ 2022, ఎపిసోడ్ 1317 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆనంద్ నా సొంత తమ్ముడు అని అనుకుంటుంది హిమ. అందుకే వాడంటే నాకు చిన్నప్పుడు అంత ప్రేమ్ ఉండేదేమో అని అనుకుంటుంది హిమ. వాడు నా రక్తమే. మా డాడీ కొడుకే. అందరూ కలిసి ఆనంద్ ను దూరం చేశారు. అనాథగా మార్చారు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో అని అనుకుంటుంది హిమ. మరోవైపు శౌర్య.. కస్టమర్ ను బస్తీలో దించుతుంది. తను చిన్నప్పుడు ఉన్న బస్తీలో అడుగుపెట్టడంతో చాలా సంతోషిస్తుంది శౌర్య.

Advertisement

will sourya finds hima in monitha house in karthika deepam

ఆ బస్తీ నుంచి వెళ్తూ.. తాను చిన్నప్పుడు ఉన్న ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి తలుపులు తీసే ఉండటం, లైట్స్ వేసి ఉండటంతో ఆ ఇంట్లో ఎవరో ఉన్నారని అనుకుంటుంది శౌర్య. ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ కార్తీక్ ఫోటోను చూసి షాక్ అవుతుంది. అలాగే.. కార్తీక్, మోనిత కలిసి ఉన్న ఫోటోను కూడా చూసి షాక్ అవుతుంది. అంటే.. మోనిత ఆంటి నాన్న.. అంటూ షాక్ అవుతుంది. అంటే.. మోనిత ఆంటి నాన్న.. అంటూ షాక్ అవుతుంది. అంటే ఆనంద్ మోనిత కొడుకా అని షాక్ అవుతుంది. అంటే.. వాడు మా తమ్ముడా అనుకుంటుంది.

Advertisement

మా అమ్మను మోసం చేసిన ఆ మోనిత ఆంటి కొడుకు నా తమ్ముడే కదా. అప్పుడే వాడిని ఇంట్లో నుంచి పంపించి మంచి పని చేశారు. ఇప్పటి దాకా.. అక్కా చెల్లి అనుబంధమే నాకు నచ్చనిది. ఇప్పుడు తమ్ముడు అనే బంధం కూడా లేదు.. అని అనుకుంటుంది శౌర్య.

ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలుస్తుంది. దీంతో ఒక ముసలావిడ వస్తుంది. ఈ ఇంట్లో ఎవరూ ఉండరు అని చెబుతుంది. నీ ఈడు ఉన్న ఓ అమ్మాయి వచ్చి దీపాలు వెలిగించి పోతుందని చెబుతుంది. దీంతో హిమ ఇక్కడికి వస్తుందా? హిమ ఇదే ఊళ్లో ఉందా అని అనుకుంటుంది.

Advertisement

మరోవైపు హిమ.. ఇంటికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది సౌందర్య. పదమ్మా భోం చేద్దాం అంటే.. నేను భోం చేశాను బయట. మీరు వెళ్లి తినండి అంటుంది. తాతయ్య మీకు ఎన్నిసార్లు చెప్పాను నాకోసం ఎదురు చూడొద్దని అంటుంది హిమ.

Karthika Deepam : ప్రేమ్ ను ఇంటికి పిలిచిన స్వప్న

మరోవైపు ప్రేమ్ ను రమ్మని పిలుస్తుంది స్వప్న. గుడికి వెళ్దాం పదా అంటుంది కానీ.. ప్రేమ్ కు కోపం వస్తుంది. గుడికి వెళ్లడం కోసం అర్జెంట్ గా రమ్మన్నావా అంటాడు. ఏంటి మమ్మి ఇది.. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లేదానివి.. గుడికి వెళ్లడం కోసం నన్ను పిలిచావంటే నేను నమ్మను అంటాడు ప్రేమ్.

ఈరోజు మంచి రోజు కావడం వల్ల గుడికి వెళ్తే మంచి జరుగుతుందని ప్రేమ్ ను గుడికి తీసుకెళ్తుంది స్వప్న. మరోవైపు హిమను పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తుంది సౌందర్య. పెళ్లి కూతురులా మనవరాలును ముస్తాబు చేశావు అంటాడు ఆనంద రావు.

దీంతో హిమకు కోపం వస్తుంది. తన పెళ్లి మ్యాటర్ ను ఇంకోసారి తీయొద్దు అంటుంది. నేను శౌర్య కనిపించేదాకా పెళ్లి చేసుకోను. నాకు పెళ్లి అనేది అంతగా ముఖ్యం కాదు. శౌర్యను వెతకడమే నా పని. శౌర్య కోసమే నేను ఇప్పుడు నేను బతికి ఉన్నాను. నాకు పెళ్లి అవసరం లేదు అంటూ సీరియస్ అవుతుంది హిమ.

Advertisement

మీ ఇద్దరికీ ఇప్పుడే చెబుతున్నాను.. పెళ్లి పెళ్లి అంటూ నా ప్రాణం తీయకండి.. అంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి