will vasudhara meet rishi in guppedantha manasu
Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. గుప్పెడంత మనసు సీరియల్ 16 జనవరి 2023, సోమవారం ఎపిసోడ్ 661 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాలేజీకి వెళ్లిన రిషి.. వసుధార క్లాస్ రూమ్ కు వెళ్లి అక్కడే కూర్చొని తన గురించే ఆలోచిస్తుంటారు. వసుధారకు ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంటాడు. మరోవైపు చక్రపాణి వసుకు ఫోన్ ఇచ్చి ఇదిగో నా ఫోన్ వెళ్లి వెంటనే రిషి సార్ కు ఫోన్ చేయి అంటాడు చక్రపాణి. దీంతో వసుధార ఆ ఫోన్ ను బయటికి తీసుకొచ్చి రిషి సార్ కు ఫోన్ చేస్తుంది. కొత్త నెంబర్ అయ్యేసరికి ఫోన్ ఎత్తాలా వద్దా అని అనుకొని చివరకు ఫోన్ ఎత్తుతాడు రిషి. హల్ ఎవరు అంటాడు కానీ.. వసుధార ఏం మాట్లాడదు. ఆయన మాటలను తన ఫోన్ లో రికార్డు చేసుకుంటుంది వసుధార. మళ్లీ ఆ నెంబర్ కు ఫోన్ చేస్తాడు రిషి. కానీ.. ఫోన్ లిఫ్ట్ చేయదు. కట్ చేస్తుంది.
will vasudhara meet rishi in guppedantha manasu
అసలు ఎవరు వీళ్లు. కాల్ ఎందుకు చేసినట్టు. మళ్లీ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నట్టు అనుకొని మళ్లీ ఫోన్ చేస్తాడు రిషి. దీంతో నర్సుకు ఫోన్ ఇచ్చి రాంగ్ నెంబర్ అని చెప్పిస్తుంది. దీంతో ఫోన్ పెట్టేస్తాడు రిషి. రిషి సార్.. మీరు నిజంగా జెంటిల్ మెన్. మీరు ప్రిన్స్. మీ కోపాలను, సందేహాలను త్వరలోనే తీర్చే రోజు వస్తుంది సార్ అని అనుకొని.. వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్తుంది. సుమిత్ర గారి బిల్ ఎంతైంది అని అడుగుతుంది వసుధార. దీంతో చక్రపాణి, సుమిత్ర బిల్ ను రిషీంద్ర భూషణ్ అనే వ్యక్తి కట్టేశారు అని చెబుతుంది. దీంతో వసుధార షాక్ అవుతుంది. ఇంతలో చక్రపాణి వచ్చి రిషి వచ్చాడు. తనేంటో.. తన మంచితనం ఏంటో నాకు తెలిసింది అంటాడు చక్రపాణి. గందం చెక్క ఏదో గంజాయి మొక్క ఏదో నేను తెలుసుకున్నాను అమ్మ. త్వరగా వెళ్లి రిషి సార్ ను కలుసుకో అమ్మ అంటాడు చక్రపాణి.
మరోవైపు మీటింగ్ మధ్యలోనే ఆపి రిషి సార్ వెళ్లిపోయారు ఏంటి.. అని కాలేజీలో ఇద్దరు లెక్చరర్స్ మాట్లాడుకుంటారు. జగతి, వసుధార గురించి మాట్లాడుకుంటుండగా… జగతి వెళ్లి ఆ ఇద్దరు లెక్చర్లకు క్లాస్ పీకుతుంది.
ఏం మాట్లాడుతున్నారు మేడమ్. ఎన్నిసార్లు చెప్పినా మీ వరస మారదా? ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు పాజిటివ్ గా చూడాలి కానీ.. నోటికొచ్చినట్టు వాగితే ఎలా. మీకు ఉద్యోగాలు ఇచ్చి నెల నెలా జీతాలు ఇస్తుంటే మీరు భూషణ్ ఫ్యామిలీని దూషిస్తున్నారా? మీకు జీతాలు ఇస్తున్నారు కానీ.. సంస్కారం మరిచిపోయారు.. అంటూ వాళ్లపై సీరియస్ అవుతుంది.
కట్ చేస్తే.. సుమిత్రను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. ఇల్లు అంతా చిందర వందరగా ఉండటం చూసి చక్రపాణి, వసుధార షాక్ అవుతారు. ఇంకేం ఆలోచించకండి నాన్న అంటుంది. దీంతో ఆలోచించకుండా ఎలా ఉంటాను.
జరిగింది చిన్న విషయం కాదు కదా అంటాడు. గండం గడిచింది అనుకోవాలా? మంచి జరిగింది అనుకోవాలా? నీ భవిష్యత్తు పాడవకుండా ఆగిందనుకోవాలా? అసలు ఏమీ ఆలోచించాలన్నది కూడా నాకు అర్థం కావడం లేదు అంటాడు చక్రపాణి.
మీమీద నాకు ఏ కోపం లేదు నాన్న అంటుంది వసుధార? నాన్న.. ప్లీజ్ అంటుంది వసుధార. మా నాన్న ప్రేమగా ఒక్క మాట మాట్లాడితే బాగుండు. మా మనసులను అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం. అంతే.. నీ మీద మాకు కోపం ఎందుకు ఉంటుంది నాన్న అంటుంది వసుధార.
వసుధార కాళ్ల మీద పడి నన్ను క్షమించు అని వేడుకుంటాడు చక్రపాణి. ఆ తర్వాత రిషి వాచ్ ను చూస్తుంది వసుధార. తర్వాత రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
This website uses cookies.