
akhil jump from etv dhee dance show he is now biggboss ott
Dhee Show : తెలుగు ప్రేక్షకులకు డాన్స్ ఓ అంటే ఒకటే షో గుర్తొస్తుంది. అదే ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో. ఈ డాన్స్ షో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. గతంలో మంచి రేటింగ్ ను దక్కించుకున్న ఈ షో ఇప్పుడు మాత్రం ప్రాభవం కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతుంది. గత నాలుగైదు సీజన్ లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఈ సీజన్ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతుంది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం సుధీర్ మరియు రష్మీ లేకపోవడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారికి అలవాటు పడ్డ ప్రేక్షకులు ఇప్పుడు వారు లేకుండా షో ను చూడడానికి ఇష్టపడటం లేదు.ఆది మరియు ఇతర టీమ్ లీడర్ లు మరియు ప్రదీప్ ఉన్నా కూడా ఏమాత్రం ఉపయోగం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది.
ఢీ డాన్స్ షో లో డాన్స్ కంటే ఎక్కువ ఇంతకు ముందు కామెడీ ఫన్నీ టాస్క్ లు ఉండేవి. ప్రదీప్ మరియు సుధీర్ ల కాంబినేషన్ లో అద్భుతమైన కెమిస్ట్రీ ఉండడంతో షో కు మంచి ఉన్న ఆదరణ దక్కింది. గతంలో వచ్చిన ఎపిసోడ్ లు ఇంకా కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి అంటే ఎంత ఆదరణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ అధిక బడ్జెట్ అవుతుందని కారణంతోనో లేదా మరేదో కారణం వలనో కాని షో నుండి సుధీర్ మరియు రష్మీ ని తప్పించడం జరిగింది. వారిద్దరిని తప్పించడంతో షో మొత్తం కళ తప్పినట్లు అయింది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మొదటి రెండు మూడు వారాల తర్వాత అయినా వారిని తీసుకొస్తారని అంతా భావించారు. కానీ వారిని తీసుకు వచ్చే ఉద్దేశం లేదని క్లారిటీ వచ్చేసింది. వారు లేకుండానే షో కొనసాగే అవకాశాలు ముందు ముందు కూడా ఉన్నాయి.
with out Sudigali Sudheer and Rashmi Gautam etv Dhee dance show rating
గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని దారుణమైన రేటింగ్ ఈ సీజన్ దక్కించుకుంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన రేటింగ్ ముందు ముందు కూడా కొనసాగితే వచ్చే సీజన్ ను అసలు జనాలు పట్టించుకోరేమో అనిపిస్తుంది. బ్రాండ్ కూడా ప్రమోషన్ కు ముందుకు రాకపోవచ్చు అంటూ ఆ టాక్ వినిపిస్తోంది. ఈటీవీ మరియు మల్లెమాల వాళ్ళు కావాలనే సుధీర్ ను పక్కన పెట్టడం వల్ల నష్టపోతున్నారు. వారిద్దరు లేకపోవడంతో అతి పెద్ద మైనస్ గా మారింది అని వినిపిస్తుంది. సుధీర్ తనను ఢీ నుండి తప్పించారని స్వయంగా చెప్పుకొచ్చాడు. హీరోగా ఎంత బిజీగా ఉన్నా కూడా జబర్దస్త్ మరియు ఢీ షో లను అతను వదులుకోవద్దు అనుకున్నాడు. కానీ ఢీ డాన్స్ షో నుండి తప్పించడం జరిగింది. ముందు ముందు జబర్దస్త్ నుండి కూడా తీసేస్తారు అనే చర్చ జరుగుతోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.