YSRCP : సినిమా వాళ్లు బ‌లిసి కొట్టుకుంటున్నారంటూ వైసీపీ ఎమ్మేల్యే కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : సినిమా వాళ్లు బ‌లిసి కొట్టుకుంటున్నారంటూ వైసీపీ ఎమ్మేల్యే కామెంట్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :10 January 2022,7:30 pm

YSRCP : గ‌త కొద్ది రోజులుగా ఏపీ ప్ర‌భుత్వానికి, టాలీవుడ్ ప‌రిశ్ర‌మ మ‌ధ్య పెద్ద వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. సినిమా టిక్కెట్ ఇష్యూతో పాటు థియేట‌ర్ స‌మ‌స్య ఇండ‌స్ట్రీని క‌ల‌వ‌ర పెడుతుంది. ఈ స‌మస్యకు ముగింపు ప‌లికేందుకు ప‌లువురు మ‌ధ్య వ‌ర్తిత్వం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు సంచ‌న‌ల కామెంట్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాని స్ట‌న్నింగ్ కామెంట్స్ చేశారు. వ‌ర్మ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన వైసీపీ ఎమ్మేల్యే సినిమా వాళ్లు బ‌లిసి కొట్టుకుంటున్నార‌ని కామెంట్స్ చేశాడు.

టాలీవుడ్‌ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. అసలు సినిమా వారికి ఏపీ అంటే గుర్తుందా? అని ప్రశ్నించారు. టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేంటని ఆయన సమర్ధించుకున్నారు. సినిమా వాళ్లంతా హైదరాబాద్‌ లో ఉన్నారని.. అసలు వారికి ఏపీలో ఒక ప్రభుత్వం ఉన్నారని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని కనిపిస్తోందా అని ప్రశ్నించారు.

YSRCP mla comments on tollywood

YSRCP mla comments on tollywood

YSRCP : వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మేల్యే

కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సినిమా వాళ్ల గురించి ఈ వ్యాఖ్యలు చేసిన ప్ర‌స‌న్న కుమార్ సినిమాలో ఉన్న పెద్దలంతా చంద్రబాబు మనుషులే.. అని.. ఆయన కులానికి చెందిన వారే ఎక్కువమంది ఇండస్ట్రీలో ఉన్నారంటూ మరో వివాదానికి తెరలేపారు. అసలు హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.. పేదల కోసం టికెట్ల ధరలు తగ్గిస్తే వారికి వచ్చిన నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు..

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది