Telugu Movies following the same trend Stories of kings
Tollwood: ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టిన కృతి శెట్టి ఇప్పుడు యంగ్ హీరోయిన్స్‌లో క్రేజీ ఆఫర్స్ అందుకుటున్న లక్కీ గాళ్ అని చెప్పాలి. ఈ సినిమాకి ముందు అమ్మడు అవకాశాల కోసం బాగానే తిరిగింది. ఇప్పుడు అవకాశాలిచ్చేందుకు మేకర్స్‌ను తన వెంట తిప్పుకుంటుంది. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ భామ చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయి. మొత్తంగా వచ్చిన రెండేళ్ళలోపే చేతిలో 10 సినిమాలను పెట్టుకుంది. దాంతో తన రెమ్యునరేషన్ ఇప్పుడు కోటిన్నరకు పైగానే ఉంది. అంతకు తగ్గితే నిర్మొహమాటంగా నో అంటుందట.
కేతిక శర్మ..పూరి జగన్నాథ్ సినిమాతో పరిచయమైన హీరోయిన్ అంటే ఆయన రాసిన డైలాగ్ మాదిరిగా వెనకా మూందు చూస్తేనే మెంటలెక్కిపోద్ది. ఆ రేంజ్‌లో యమా హాట్‌గా ఉంటారు పూరి పరిచయం చేసే హీరోయిన్స్. అలా రొమాంటిక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కేతిక ఓ మాదిరిగా సత్తా చాటుతోంది. ఇదే బ్యూటీకి భారీ హిట్స్ పడితే మాత్రం మోత మరోలా మోగేది. కానీ, రొమాంటిక్..లక్ష్య సినిమాలు ఆశించిన సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు ఈమె చేతిలో వైష్ణవ్ తేజ్ సినిమా ఒక్కటే ఉంది. అయినా రెమ్యునరేషన్ బాగానే అందుతోందట. ఎంత లేదన్నా రూ 75 లక్షల నుంచి కోటి డిమాండ్ చేస్తున్నట్టు టాక్ ఉంది.
Tollwood young heroines demands more remuniration with one block buster
ఇక దర్శకేంద్రుడు ముద్ర వేసిన ఏ హీరోయిన్ అయినా కొన్నేళ్ళు ఇండస్ట్రీలో అంద చందాలతో అరుపులు అరిపించాల్సిందే. శ్రీలీల కూడా ఇదే లిస్ట్‌లో చేరింది. ఈ కుర్ర భామ కన్నడ, తెలుగు సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది. ఇప్పుడు రవితేజ, నితిన్ సినిమాలు చేస్తోంది. చేతిలో మరికొన్ని సినిమాలున్నాయి. ఉప్పెన బ్యూటీ రేంజ్ కాకపోయినా కూడా శ్రీలీలకు కోటి కావాలని చెబుతుందట. ప్రాజెక్ట్ పెద్దదైతే కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.మరి మన మేకర్స్ ఒక్క హిట్ దక్కితే సూట్‌కేసులు పట్టుకుని క్యూ కడుతున్నారు. వాళ్లకు కావాల్సిన రిక్వైర్‌మెంట్స్ వారికుంటే వీరికి ఉండాల్సిన డిమాండ్స్ వీరికున్నాయి. మొత్తానికి అలా సర్దుకుపోతున్నారు. ఏదేమైనా కృతిశెట్టి, శ్రీలీల ఈ ఏడాదిలో పెద్ద హీరోయిన్స్ లిస్ట్‌లో చేరడం ఖాయం.
Tollwood young heroines demands more remuniration with one block buster
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
This website uses cookies.