Categories: andhra pradeshNews

CBN – Roja : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన ఆర్కే రోజా

Advertisement
Advertisement

Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నగరి సభలో జనసమీకరణ లేక ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయని, ఇది ఒక ‘అట్టర్ ప్లాప్’ షో అని ఆమె అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పనిచేసినా, సొంత జిల్లాలోని నగరి నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, అందుకే చెప్పుకోవడానికి పనులు లేక వైఎస్ జగన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. సభ కోసం స్థానిక ఆసుపత్రిలోని రోగులను సైతం ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించారు.

Advertisement

CBN – Roja : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన ఆర్కే రోజా

జగన్ హయాంలోనే నగరి అభివృద్ధి

Advertisement

నగరి అభివృద్ధి విషయంలో జగన్ ప్రభుత్వానిదే పైచేయి అని రోజా గణాంకాలతో వివరించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పునాది పడిన 100 పడకల ఆసుపత్రిని జగన్ కాలంలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని, డయాలసిస్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పాలిటెక్నిక్ కాలేజీలు, షాదీ మహల్ వంటి అనేక నిర్మాణాలు తమ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న ముద్దుకృష్ణమనాయుడు, ఆయన కుమారుడు భానుప్రకాష్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, రైతు భరోసా కేంద్రాలు మరియు సచివాలయాల వ్యవస్థ ద్వారా తాము పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లామని స్పష్టం చేశారు.

చంద్రబాబు పై రోజా ఫైర్

ముఖ్యంగా భూముల రీసర్వే అంశంపై చంద్రబాబు ద్వంద్వ వైఖరిని రోజా ఎండగట్టారు. గతంలో జగన్ భూములను కాజేస్తారని విష ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే రీసర్వేను తమ గొప్పతనంగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. జగన్ తెచ్చిన ఆధునిక టెక్నాలజీ, డ్రోన్లు, హెలికాప్టర్లను వాడుకుంటూ, కేవలం పాస్‌బుక్‌ల అట్టలు మార్చి ‘కాపీ క్యాట్’ లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రవేశపెట్టిన సర్వే వల్ల ప్రభుత్వానికి రూ. 400 కోట్ల రాయితీ వచ్చిందని, ధైర్యముంటే ఆ సర్వేను రద్దు చేయాలని ఆమె సవాలు విసిరారు.

Recent Posts

Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…

3 minutes ago

Samantha : రెండో భర్త రాజ్ కోసం సమంత సంచలన నిర్ణయం !!

Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…

30 minutes ago

బిగ్ బ్రేకింగ్ : జగన్ గుండెలు అదిరేలా సంచలన ప్రకటన చేసిన విజయ సాయి రెడ్డి..

Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…

2 hours ago

Samantha : రెండో పెళ్లి అయ్యి 2 నెలలు కూడా కాలేదు..అప్పుడే సమంతకి బిగ్‌ న్యూస్‌

Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…

3 hours ago

Chiranjeevi : చిరంజీవి గారు మీరు కూడా అలా అనోచ్చా..!

Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…

4 hours ago

Today Gold Rate on Jan 29th 2026 : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు..ఈరోజు కూడా భారీగా పెరిగిన బంగారం , వెండి ధరలు

Today Gold Rate on Jan 29th 2026 :  బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…

5 hours ago

Karthika Deepam 2 Today Episode: జ్యో అత్త కూతురు కాదని బాంబ్ పేల్చిన కార్తీక్‌..దాసు వార్నింగ్..దీప‌ను చంపేలా కొత్త ప్లాన్..!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 27వ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు…

6 hours ago

Black Hair : జుట్టుకు రంగు అక్కర్లేదు..ఈ సింపుల్ చిట్కాతో 15 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి..!

Black Hair : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వర్క్ టెన్షన్స్ కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే…

6 hours ago