Chicken Fry Piece Biryani Recipe : హోటల్ స్టైల్ లో స్పెషల్ చికెన్ ఫ్రై పీసెస్ బిర్యాని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.. ఇది చాలా ఈజీ అండి. దీని కోసం ప్రత్యేకించి గ్రేవీ కూడా చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్ చికెన్ ఫ్రై పీసెస్ బిర్యానీ తయారీ విధానాన్ని చూసేద్దాం.. దీనికి కావాల్సిన పదార్థాలు : చికెన్, ఆయిల్ ,పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర ,పుదీనా, పెరుగు, ఉల్లిపాయలు, ఆనియన్, కసూరి మేతి, హోల్ గరం మసాలా, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, పచ్చిమిర్చి మొదలైనవి..
తయారీ విధానం: ఒక కేజీ చికెన్ తీసుకుని రెండు మూడు సార్లు పాటు వాష్ చేసి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ వేయండి. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు తీసుకుని కొంచెం కట్ చేసుకుని యాడ్ చేసుకోండి! ఇవన్నీ బాగా కలిపి కనీసం 20 నిమిషాల పాటు ఫ్రిజ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి.ఇప్పుడు ఈ ఫ్రై పీస్ బిర్యాని కి మెయిన్ గా మనకి మసాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాని కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక అనాసపువ్వు, ఒక చిన్న బిర్యాని ఆకు, ఒక జాపత్రి హాఫ్ తీసుకున్నక మిరియాలు ఒక టీ స్పూన్ దాకా ఒక టీ స్పూన్ దాకా గసగసాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసి వీటన్నిటిని కూడా లైట్ గా కోర్సుగా బ్లెండ్ చేసుకుని మసాలా పౌడర్ ని ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టుకోండి.
అదే మిక్సీ జార్ లో చిన్నవి అయితే రెండు పెద్దదైతే ఒక టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ కడాయిలో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హిట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగును వేసి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి ఈ ఆయిల్ లో కొద్దిసేపు ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరి ని కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా పైకి కిందకి కూడా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టి ఐదు నుండి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించండి. మూత పెట్టకుండా వంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు అంటుకుపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ అనేది కొంచెం దగ్గరగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి.అలాగే మందంగా ఉండే కుక్కర్ గిన్నె కానీ పెట్టుకోండి. కేజీ చికెన్ తో బిర్యాని చేస్తున్నాం కాబట్టి రైస్ పట్టే విధంగా కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ హోల్ బిర్యానీ మసాలావేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా చేయించుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేయండి.. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అలాగే పుదీనా కొద్దిగా వేసుకుని వీటిని కూడా ఆయిల్ లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి.
తర్వాత ఇందులోకి ముప్పావు కేజీ దాకా గంట పాటు నానబెట్టుకున్న రైస్ ని వేస్తున్నానండి. నా దగ్గర ఉన్న గ్లాస్ తో త్రీ క్లాసెస్ రైస్ అన్నమాట ఇది వెయిట్ లా చూసుకుంటేనేను చెప్పాను. కదా సో మూడు గ్లాసుల రైస్ కి నాలుగున్నర గ్లాసుల వాటర్ ని ఆడ్ చేస్తున్నాను. అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 1 1/2 గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసేయండి. తర్వాత మంటని హాయ్ ఫ్లేమ్ లో ఉంచి పొంగొచ్చేంత వరకు ఉడికించండి. కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. చికెన్ అనేది దగ్గరికి ఉడికి పోవాలి. సో ఇలా చికెన్ దగ్గరకి అయిపోయి లైట్ గా గ్రేవీ ఉన్నప్పుడే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం కూడా వేసేయండి. అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసేయండి. ఇలా అన్ని వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసి సాల్ట్ ని ఈ స్టేజిలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే ఉంచి మీరు కలుపుతూ ఉండండి. గ్రేవీ అనేది పూర్తిగా డ్రై అయిపోకూడదు. మనకి రైస్ లోకి కలుపుకునే విధంగా ఉండాలన్నమాట. బిర్యానీ మనకి దగ్గరకు అవుతుంది. కదా ఉడుకుతున్నప్పుడు ఒకసారి గరిటతో అంత మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోండి. మూత పెట్టేసి బిర్యాని దగ్గరికి ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే కనీసం ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే కొంచెం దగ్గరగా అయిపోతుందండి. అలాగే చికెన్ కూడా మనకి రెడీ అయిపోయిందండి. చికెన్ రెడీ అయిపోయింది. అలాగే మీరు రైస్ ని కూడా చెక్ చేసుకోండి. అడుగున వాటర్ ఉంటుంది. పైన కొంచెం డ్రై గా ఉంటుంది కదా అప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చికెన్ వేసేసిన తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసుకుని ఎయిర్ టైట్ గా ఉండే మూతను పెట్టేసేయండి. ఆవిరి బయటికి పోకుండా పెట్టేసి లో ఫ్లేమ్ లోనే నిదానంగా టర్మ్ చేసుకోవాలి. కనీసం ఇది 15 నుంచి 20 మినిట్స్ దాక టైం పడుతుంది. తర్వాత స్టాప్ చేసేసుకొని ఈ బిర్యానీ పార్టీని పక్కన పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాత తీసుకొని వేడి వేడిగా చికెన్ పీసెస్ తో సహా సర్వ్ చేసుకోండి. అంతేనండి చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయింది. చేసుకోవడం చాలా ఈజీ కదా అలాగే టేస్ట్ కూడా వేరే లెవెల్ లో ఉంటుంది..
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.