Veg Cutlet Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్నా డబల్ క్రిస్పీ సేమియా వెజ్ బుల్లెట్స్.. ఇది మామూలు క్రంచిగా ఉండవు జబర్దస్త్ క్రంచి గా ఉంటాయి. బుల్లెట్స్ హైదరాబాద్ ఏ ప్రీమియం స్వీట్ షాప్ కి వెళ్లిన దొరుకుతాయి. అటువంటి రెసిపీ ఈరోజు మనం ఇంట్లో తయారు చేసుకోబోతున్నాం.. ఇప్పుడు ఈ వెజ్ బుల్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు:ఆలు, స్వీట్ కార్న్ గింజలు, క్యాప్సికం, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, చాట్ మసాలా, అటుకులు, మైదా, సెనగపిండి, సన్నని సేమియా, ఆయిల్, క్యారెట్ ముక్కలు మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక కప్పు అటుకుల్ని తీసుకొని వాటిని జల్లించుకోవాలి. తర్వాత అటుకులు నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి.
తర్వాత వాటిని పిండి పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని చేతితో బాగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత దాన్లో ఉడికించుకున్న రెండు ఆలుని తీసుకొని తురుముకొని వేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ గింజలను, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి సన్నని ముక్కలు, క్యాప్సికం ముక్కలను సన్నగా తరిమికొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒక స్పూన్ కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, మిరియాల పొడి అరచేక్క నిమ్మకాయ, కొంచెం ఉప్పు వేసి బాగా బాగా గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. తర్వాత వీటిని బుల్లెట్స్ మాదిరిగా రోల్ చేసుకోవాలి. అన్ని బుల్లెట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో అరకప్పు మైదాని తీసుకొని దాన్లో కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోస్తూ బాగా పల్చగా కలుపుకోవాలి.
తర్వాత ఒక ఫ్లాట్ బౌల్లో ఒక అరకప్పు శెనగపిండి దానిలో కొంచెం ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో సన్నని సేమియా తీసుకొని వాటిని బాగా అరఇంచ ముక్క అయ్యేవరకు స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా చేసుకున్న వెజ్ బుల్లెట్స్ ని తీసుకొని ముందుగా సెనగపిండిలో రోల్ చేసి తర్వాత మైదాపిండి మిశ్రమంలో కోట్ చేసి తర్వాత సేమ్యాలో కూడా బాగా రోల్ చేసి సేమియా మొత్తం అద్దుకోవాలి. ఆ విధంగా అద్దు కున్న బుల్లెట్స్ ను డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ పోసి అది హీటెక్కిన తర్వాత ఆ బుల్లెట్లను దాన్లో వేసి రెండు వైపులా బాగా ఎర్రగా క్రిస్పీగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా వెజ్ బుల్లెట్స్ రెడీ. ఇవి వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.