Harmful Food : ఇంట్లో అందరూ ఒకే అభిరుచులు కలిగి ఉండరు. కొంతమందికి వేపుడు అంటే ఇష్టం ఇంకొందరికి పులుసు అంటే ఇష్టం.. మరికొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు.. మరికొందరికి అయితే సీ ఫుడ్స్ ఉంటేనే భోంచేస్తారు. ఇలా ఇంట్లోనే రకరకాల రుచి కలిగిన వాళ్ళు ఉంటూ ఉంటారు. అభిరుచులు ఎలా ఉన్నాగాని మన శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చే ఫుడ్స్ ని తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్.. ఇష్టమైన ఫుడ్ని అదే పనిగా తిన్నా కూడా అనర్ధాలే అందుకని మన శరీరానికి కావలసిన పోషకాలు అందే ఆహారాన్ని సక్రమంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా కావాలి అంటే అవి చేపల్లోనే మనకు లభ్యమవుతాయి. కాబట్టి వారంలో రెండు సార్లు చేపలు తింటే మంచిదని దానివల్ల గుండె జబ్బులు రావని అమెరికన్ హాట్ అసోసియేషన్ చేసిన ఒక పరిశోధన వెల్లడించింది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాలను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. చేపలను తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. వారంలో రెండు సార్లు మొత్తం కలిపి 100 గ్రాముల వరకు ఉడకబెట్టిన లేదా గ్రిల్ చేసిన చేపలను తింటే గుండెజబ్బులు రాకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. చేపలు మనం ఎలా తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా.. మరైతే చేపలతో కలిపి తినకూడని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అలా తింటే ఎన్ని అనర్ధాలు వస్తాయి.
పూర్తి వివరాలు తెలుసుకుందాం. చేపలను తరచూ తింటుంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. గుండె సమస్యలు ఉన్నవారు తరుచూ చేపలను తీసుకుంటే మంచిది. చేపలను తరుచూ తినేవారిలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ వస్తుంది. డయాబెటిస్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వారి మెదడు బాగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చేపలు ఎలా పడితే అలా తినకూడదు. మరి ఏ ఆహారం పడితే ఆహారంతో కలిపి తినకూడదు. అలా తినడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.. చేపలతో మీరు భోజనం ముగించిన తర్వాత వెంటనే పాలను తాగకండి. అంటే భోజనమైన తర్వాత రాత్రి వేళలో కొంతమంది పాలు తాగి పడుకోవడం అలవాటు ఉంటుంది కదా.. అటువంటి వాళ్ళు చేపలతో కనుక భోజనం చేస్తే ఆ రోజు పాలను తాగకండి. అంటే వెంటనే తాగకండి కొంత సమయం ఒక గంట గ్యాప్ ఇచ్చిన తాగాలి. లేదంటే పూర్తిగా అవాయిడ్ చేయడం కూడా మంచిది.
ఎందుకంటే పాలు మన బాడీకి కూల్చేస్తాయి. . ఈ రెండింటి మిశ్రమం మన శరీరంలో రక్తప్రసరణ పై ప్రభావం చూస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి తినకండి. కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో ఉడికించిన గుడ్లు అలాగే చేపలు తినడం అలవాటు చేసుకుంటారు. నిజానికి గుడ్లు చేపల్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిపి తినడం వల్ల అరుగుదల శక్తి మందగిస్తుంది. మీరు తిన్న ఆహారం చాలా ఎక్కువ సేపు అరగడానికి టైం తీసుకుంటుంది.కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు కలిపి తినకండి. అలాగే పెరుగు చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంటే మీరు చేపలతో భోజనం చేసిన తర్వాత తినకండి.. కొంతమందికి పెరుగుతో భోజనాన్ని ముగించడం అలవాటు కదా..
అలా మీ అలవాటును చేపల కూర తీసుకున్నప్పుడు మాత్రం అవాయిడ్ చేయండి. అయితే ఈ రెండు ప్రోటీన్ల మధ్య వ్యత్యాసం ఉందని కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు. రెండింటిలోనూ వివిధ రకాల ప్రోటీన్లు ఉంటాయి.అందువల్ల పెరుగు చేపలను కలిపి తింటే జీర్ణక్రియలో సమస్య ఏర్పడుతుంది. ఎన్ని అనర్ధాలు ఉన్నాయో చూశారు కదా.. కాబట్టి డాక్టర్ సలహా మేరకు వారానికి రెండు సార్లు గాని లేదా మీ పర్సనల్ డాక్టర్ సూచించిన ప్రకారం మీ డైట్ లో చేపలను కచ్చితంగా చేర్చుకోండి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేపల ద్వారా మనకు అందుతాయి..
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
This website uses cookies.