Home » News » Karthika Deepam 2 Today Monday Episode February 16th 2026 Highlights
News

Karthika Deepam 2 February 16th 2026 Episode : కార్తీక దీపం 2 ఫిబ్రవరి 16, 2026 ఎపిసోడ్ : “హంతకులుగా మిగిలిపోతాం” – దీప, కార్తీక్ ఎమోషనల్.. దాసు కంటపడ్డ జ్యోత్స్న!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: February 16, 2026, 8:30 am
Advertisement

Karthika Deepam 2 February 16th 2026 Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ ‘కార్తీక దీపం 2’ రోజురోజుకు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో జ్యోత్స్న ప్లాన్ ను కార్తీక్ తిప్పికొట్టగా.. ఈరోజు (ఫిబ్రవరి 16) ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా సాగింది.

Advertisement

Karthika Deepam 2 February 16th 2026 Episode : కార్తీక దీపం 2 ఫిబ్రవరి 16, 2026 ఎపిసోడ్ : “హంతకులుగా మిగిలిపోతాం” – దీప, కార్తీక్ ఎమోషనల్.. దాసు కంటపడ్డ జ్యోత్స్న!

Karthika Deepam 2 February 16th 2026 Episode : దీప, కార్తీక్ ల ఆవేదన..

ఎపిసోడ్ ప్రారంభంలోనే ఇంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. అత్తయ్య గారు (కాంచన) మన బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, గుడికి వెళ్లి పూజలు చేద్దామంటున్నారు.. కానీ ఆ బిడ్డ బతకదని తెలిస్తే ఆమె తట్టుకోలేరని దీప కుమిలిపోతుంది. “దీప.. అమ్మకు ఆ నిజం చెప్పడం నా వల్ల కాదు. ఇప్పటికే ఎన్నో బరువులు మోస్తున్నా. అమ్మ మన బిడ్డ కోసం ఎన్నో కలలు కంటోంది. ఇప్పుడు వెళ్లి ఆశలు వదులుకోమని చెప్తే.. ఆ గుండె తట్టుకోలేదు” అని కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

Advertisement

Karthika Deepam 2 February 16th 2026 Episode : డాక్టర్ చెప్పిన చేదు నిజం

జ్యోత్స్న మీద అనుమానంతో మావయ్య (శ్రీధర్) తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని కార్తీక్ దీపతో చెప్తాడు. “అక్కడ డాక్టర్ నన్ను కాపాడింది కానీ.. ఆ తర్వాత అసలు విషయం చెప్పింది. ఆపరేషన్ తర్వాత బిడ్డ బతికే అవకాశం లేదని, ఆశలు వదులుకోమని డాక్టర్ క్లియర్ గా చెప్పేసింది. ఆ మాట విన్న దగ్గరి నుంచి నా ప్రాణం విలవిలలాడుతోంది” అని కార్తీక్ దీప ఒడిలో పడి ఏడుస్తాడు. “నిజం దాస్తే మనం హంతకులుగా మిగిలిపోతాం బావ” అని దీప హెచ్చరించినా, కార్తీక్ మాత్రం తల్లి కోసం నిజాన్ని దాచడానికే నిర్ణయించుకుంటాడు.

జ్యోత్స్నని చూసి రగిలిపోయిన దాసు

మరోవైపు దాసు ఆసుపత్రి దగ్గర ఓ ఆసక్తికర దృశ్యాన్ని చూస్తాడు. జ్యోత్స్న.. డాక్టర్ హారికను కలవడం దాసు కంటపడుతుంది. “ఈ డాక్టర్ జ్యోత్స్నకు అమ్ముడుపోయి ఉంటుంది, అందుకే రిపోర్ట్స్ మార్చింది” అని దాసు అనుమానిస్తాడు. ఆవేశంగా డాక్టర్ మీదకు వెళ్లబోతుండగా కార్తీక్ వచ్చి ఆపుతాడు. అయితే జ్యోత్స్న కుట్రల వెనుక డాక్టర్ హస్తం ఉందనే విషయం దాసుకు అర్థమవుతుంది.

Advertisement

కాశీ దగ్గర నోరు జారిన దాసు

కాశీని కలిసిన దాసు.. మాటల సందర్భంలో నోరు జారుతాడు. స్వప్న తనకు విడాకులు ఇస్తానందని కాశీ బాధపడుతుంటే.. “మా అమ్మ చేసిన పాపానికి నా పిల్లల జీవితాలు ఇలా నాశనం అయ్యాయి” అని దాసు ఆవేదన వ్యక్తం చేస్తాడు. దీంతో కాశీకి అనుమానం వస్తుంది. “పిల్లలు అంటున్నావేంటి? నేను ఒక్కడినే కదా నీ కొడుకును? నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?” అని కాశీ నిలదీస్తాడు. దాసు వెంటనే మాట మార్చి కవర్ చేస్తాడు.

ట్విస్ట్ ఏంటంటే?

దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ విషయంలో డాక్టర్ చెప్పింది నిజమేనా? లేక జ్యోత్స్న బెదిరింపులకు భయపడి డాక్టర్ అబద్ధం చెప్పిందా? అనేది తెలియాల్సి ఉంది. రేపటి ఎపిసోడ్ లో కార్తీక్, దాసు కలిసి జ్యోత్స్న నిజస్వరూపాన్ని ఎలా బయటపెడతారో చూడాలి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి