Janthikalu Recipe In Telugu
Janthikalu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ మురుకులు.. ఈ విధంగా మురుకులు ప్రిపేర్ చేస్తే ఎక్స్ట్రా క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి. అలాగే మీరు ఈ టీప్ ని ఫాలో అయితే ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు చాలా ఈజీగా చేయగలరు. ఓసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి. మరి లేట్ చేయకుండా కరకరలాడుతూ క్రిస్పీగా మంచి రుచితో మురుకులు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి… దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యప్పిండి, పుట్నాల పప్పు, కలోంజి గింజలు, వాము, పసుపు, ఉప్పు, కారం, బట్టర్ మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా కిలో రైస్ ఫ్లోర్ ని తీసుకోవాలి. ఈ పిండిని జల్లించుకోవాలి. ఈ జల్లించిన పిండిని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక బౌల్ లోకి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పిండిని తీసుకొని బియ్యప్పిండిలో జల్లించి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒకటిన్నర స్పూను ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ వాము, అలాగే ఒక్క రెండు స్పూన్లు కాలోన్జి సీడ్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత రెండు స్పూన్ల బటర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేడి నీటితో ఈ పిండిని బాగా చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేడి నీటితో పిండిని కలుపుకోవడం వలన ఎక్స్ట్రా క్రిస్పీ వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న పిండిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని తర్వాత తీసి మరోకసారి కలుపుకోవాలి.
Janthikalu Recipe In Telugu
ఇక జంతికల గొట్టం తీసుకుని దాన్లో పిండిని పెట్టి ఒక క్లాత్ పై జంతికల ఒత్తుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. అలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒత్తుకున్న జంతికలను ఒక నాలుగు ఐదు వేసి బాగా ఎర్రగా వేయించి తీసుకోవాలి. అంతే అన్ని జంతికలను ఇలానే వేసి బాగా ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా ఎన్ని కిలోల జంతికలైనా చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్ తో చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇవి నెలరోజుల వరకు నిల్వ ఉంటాయి. అలాగే వీటి రుచి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.