Janthikalu Recipe : కరకరలాడే కమ్మని జంతికలు ఈ టిప్స్, కొలతలతో ఎన్ని కిలోలైనా పర్ఫెక్ట్ గా చేయగలరు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janthikalu Recipe : కరకరలాడే కమ్మని జంతికలు ఈ టిప్స్, కొలతలతో ఎన్ని కిలోలైనా పర్ఫెక్ట్ గా చేయగలరు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 January 2023,7:40 am

Janthikalu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ మురుకులు.. ఈ విధంగా మురుకులు ప్రిపేర్ చేస్తే ఎక్స్ట్రా క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి. అలాగే మీరు ఈ టీప్ ని ఫాలో అయితే ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు చాలా ఈజీగా చేయగలరు. ఓసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి. మరి లేట్ చేయకుండా కరకరలాడుతూ క్రిస్పీగా మంచి రుచితో మురుకులు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి… దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యప్పిండి, పుట్నాల పప్పు, కలోంజి గింజలు, వాము, పసుపు, ఉప్పు, కారం, బట్టర్ మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా కిలో రైస్ ఫ్లోర్ ని తీసుకోవాలి. ఈ పిండిని జల్లించుకోవాలి. ఈ జల్లించిన పిండిని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఒక బౌల్ లోకి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పిండిని తీసుకొని బియ్యప్పిండిలో జల్లించి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒకటిన్నర స్పూను ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ వాము, అలాగే ఒక్క రెండు స్పూన్లు కాలోన్జి సీడ్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత రెండు స్పూన్ల బటర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేడి నీటితో ఈ పిండిని బాగా చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేడి నీటితో పిండిని కలుపుకోవడం వలన ఎక్స్ట్రా క్రిస్పీ వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న పిండిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని తర్వాత తీసి మరోకసారి కలుపుకోవాలి.

Janthikalu Recipe In Telugu

Janthikalu Recipe In Telugu

ఇక జంతికల గొట్టం తీసుకుని దాన్లో పిండిని పెట్టి ఒక క్లాత్ పై జంతికల ఒత్తుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. అలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒత్తుకున్న జంతికలను ఒక నాలుగు ఐదు వేసి బాగా ఎర్రగా వేయించి తీసుకోవాలి. అంతే అన్ని జంతికలను ఇలానే వేసి బాగా ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా ఎన్ని కిలోల జంతికలైనా చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్ తో చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇవి నెలరోజుల వరకు నిల్వ ఉంటాయి. అలాగే వీటి రుచి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది