Home » Exclusive » Spicy Country Chicken Tomato Rasam Recipe In Telugu
Exclusive

Natukodi Recipe : చెట్టినాడు స్పెషల్ ఘాటైన నాటుకోడి టమాట చారు…!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 26, 2022 11:07 pm
Advertisement

Natukodi Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి తమిళనాడు చెట్టినాడు నాటుకోడి టమాట చారు. ఘాటుగా గుమగుమలాడిపోతూ ఈ టమాట చారు చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బెస్ట్ గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు:నాటుకోడి చికెన్, పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి, క్యారెట్ లు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు, ఆయిల్, ధనియా పౌడర్, ఎండుమిర్చి చింతపండు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక్కకుక్కరు తీసుకొని ఒక ఆఫ్ కేజీ నాటుకోడి ముక్కలను వేసుకోవాలి. తర్వాత 4 క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు పెద్ద సైజు కట్ చేసుకుని వేసుకోవాలి.

Advertisement

ఒక స్పూన్ మిరియాలు కూడా వేసి ఒక లీటర్ నీళ్లు కూడా పోసి కుక్కర్ కి మూత పెట్టి ఉడికించుకోవాలి.
తర్వాత వేరే బౌల్లోకి ఒక కప్పు టమాటాలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కొత్తిమీర వేసి బాగా గుజ్జుల చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చికెన్ మిశ్రమంలో నుంచి క్యారెట్ ముక్కలను తీసి వేసుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకుని దాంట్లో జీలకర్ర ,వెండి మిర్చి, కొంచెం ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పది వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. దాంట్లో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి బాగా వేయించుకోవాలి.

spicy country chicken tomato rasam recipe in telugu

Advertisement

తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా చిదుముకున్న టమాట గుజ్జుని దానిలో వేసి ఒక టీ స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత చికెన్ ఉడికించుకున్న నీళ్లు తర్వాత చింతపండు రసం కూడా వేసి బాగా మరిగించాలి. అలా మరిగిన మరిగిన చారులో ముందుగా ఉడికించుకున్న చికెన్ ని కూడా దాంట్లో వేసి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పాటు బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక పావు కప్పు మిరియాల పొడి కూడా వేసి బాగా కలుపుతూ మరించుకోవాలి. ఇక తర్వాత ఉప్పు కారాలు చూసుకుని తర్వాత స్టవ్ ఆపి వేరే బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా చెట్టినాడు నాటుకోడి టమాటా చారు రెడీ. ఈ నాటుకోడి టమాటా చారుఎంతో అద్భుతంగా ఉంటుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి