Spicy Egg Recipe : ఈరోజు మీకు ఉల్లికారము ఎగ్స్ రెండు కలిపి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మామూలుగా మనం ఉల్లికారంతోటి రకరకాలుగా చేసుకుంటుంటాం కదా.. ఇలా ఒకసారి ఎగ్స్ కలిపి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది. రైస్ లోకి బాగుంటుంది. అలాగే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, ఆయిల్, కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, కరివేపాకు, ఎల్లుల్లి, కొత్తిమీర, ఉల్లిపాయలు మొదలైనవి.. తయారీ విధానం: ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకొని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొండి. దీంట్లోనే ఒక 7 8 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. అలాగే కారం ఈ కారం మీ ఇష్టం అండి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. దీంట్లోనే మీరు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వీటిలో అన్నింటినీ కలిపి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఈ ఉల్లిపాయ ముక్కలు మనకు అక్కడ అక్కడ పలుకులుగా తగులుతూ ఉండాలి.
ఇలా మిక్సీకి వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. జీలకర్ర కరివేపాకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఉల్లికారాన్ని వేసుకోండి. ఈ ఉల్లికారం కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకొని బాగా వేగనివ్వండి. ఆయిల్లో ఈ ఉల్లిపాయల్లో నుంచి పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ మంచిగా కనిపిస్తుంది.. అలా వచ్చిందాకా బాగా వేగనివ్వండి. మనకి ఉల్లికారంలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. తర్వాత దీంట్లో ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు అన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఫ్లేమ్ ని మటుకు సిమ్ లోనే పెట్టుకోండి. దీంట్లో మీకు ఇష్టం ఉంటే కొద్దిగా చింతపండు రసం వేసుకోవచ్చు.
చింతపండు రసం జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. మొత్తం బాగా కలిసి పోయేటట్టు కలుపుకోండి. మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఉడికించుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. మూడు ఎగ్స్ తీసుకొని ఉడికించుకొని హాఫ్ కి కట్ చేసుకొని. ఈ ఎగ్స్ ని పెట్టుకోండి. లేదు మీరు ఫుల్ ఎగ్ అయినా వేసుకోవచ్చు.. ఈ విధంగా పెట్టుకొని నిదానంగా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ సరిపోతుంది. అడుగున మాడిపోతుంది. కాబట్టి సిం లోనే పెట్టుకోండి. కొద్దిగా సేపు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి ఉల్లికారం అనేది ఎగ్స్ కి పడితే సరిపోతుంది. మీరు ఇంకా కావాలంటే ఎగ్స్ ని ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్లో ఫ్రై చేసిన వేసుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్ మటికి.. రైస్ లోకి తినండి లేదా చపాతీలో తినొచ్చు ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.