Home » Exclusive » Telangana Style Chepala Pulusu Recipe In Telugu
Exclusive

Chepala Pulusu Recipe : ఎప్పుడు చేసిన గొప్ప రుచితో చేపల పులుసుకి ఈ టిప్స్ చాలండి..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 24, 2023 10:25 pm
Advertisement

Chepala Pulusu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ చేపల పులుసు. ఈ తెలంగాణ స్టైల్ చేపల పులుసు చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ పులుసు కనీసం మూడు రోజులు కూడా నిల్వ ఉంటుంది. అన్నంతోనైనా చపాతి తోనే దేనితోనైనా తీసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. దీనికి కావాల్సిన పదార్ధాలు : చేపలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెండి కొబ్బరి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు, గసగసాలు, వాము, చింతపండు, కారం, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర మొదలైనవి.. దీని తయారీ విధానం : ముందుగా ఒక కేజీ చేపలను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వేసుకొని దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి బాగా పట్టించాలి. ఇప్పుడు డ్రిల్ల్ మీద నాలుగు ఉల్లిగడ్డలను పెట్టి బాగా కాల్చుకోవాలి.

Advertisement

కాలిన ఉల్లిపాయల పైన ఉన్న తొక్కని తీసేసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా పట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి దానిలో ఒక టీ స్పూన్ మెంతులు ,ఒక టీ స్పూన్ జీలకర్ర ,రెండు టీ స్పూన్ల ధనియాలు, 4 5 యాలకులు, రెండు దాల్చిన చెక్కలు, రెండు లవంగాలు, అర స్పూను మిరియాలు, పావుకప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత రెండు చిటికెళ్ల వాము కూడా వేసుకోవాలి. మసాలాలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి దానిలో ఒక పావు కప్పు గసగసాలు వేసుకోవాలి. అవి ఆ వేడికి బాగా చిటపటలాడుతూ ఉంటాయి. తర్వాత పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక చింతపండు గుజ్జు తీసుకొని దాన్లో ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్టు అలాగే పావు కప్పు కారం, పావు కప్పు ఉప్పు, వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

Telangana Style Chepala Pulusu Recipe in Telugu

Advertisement

తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వెడి ఎక్కిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు దాల్చిన చెక్కలు వేసి వేపుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని దాన్లో పోసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక ఈ పులుసులో నుంచి నూనె పైకి తేలుతూ ఉండగా ఒక లీటర్ వేడి నీటిని పోసి అది మసులుతుండగా మనం ముందుగా పొడి చేసుకున్న మసాలాని కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇక తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొని దాంట్లో వేసి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి.ఈ చేపల పులుసు నుంచి నూనె పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దింపి వేరే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే ఈ విధంగా చేసుకుంటే ఈ చేపల పులుసు రెండు రోజులు వరకు నిల్వ ఉంటుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి