Natu Kodi Pulusu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి తెలుగువారి నాటుకోడి పులుసు, గారెలు ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. ఈ సంక్రాంతి కనుమ రోజు తప్పకుండా నాటుకోడి పులుసు, గారెలు ఉండాల్సిందే.. అదిరిపోయే నాటుకోడి పులుసు దాని కాంబినేషన్ గారెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : నాటుకోడి మాంసం, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు, వెండికొబ్బరి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి, టమాటాలు, మినప్పప్పు, కొత్తిమీర, ఆయిల్ మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా గారెలు కోసం ఒక కప్పు మినప్పప్పు శుభ్రంగా కడిగి మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత నాటుకోడి పులుసు కోసం ఒక కేజీ నాటుకోడి మాంసం తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి.
దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక రెండు స్పూన్లు ఆయిల్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక గంట వరకు నానబెట్టుకోవాలి.తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు టమాటా కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లను కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఇక నాటుకోడి పులుసులోకి మసాలా కోసం ఒక పాన్ లో ఒక రెండు స్పూన్లు ధనియాలు, నాలుగైదు యాలకులు, ఐదు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక నాలుగు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, అర టీ స్పూన్ మిరియాలు, రెండు బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి.
కొద్దిగా వేగిన తర్వాత దాన్లో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి వేయించుకొని వాటిని తీసి మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక మనం ముందుగా చేసుకున్న టమాటా మిశ్రమంలో ముందుగా రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత ఒక అర లీటర్ల నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత మూత పెట్టి మరొక 15 నిమిషాలు ఉడికించుకొని తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర,
అలాగే కొంచెం నిమ్మరసం వేసి స్టవ్ ఆపి దింపుకోవడమే అంతే నాటుకోడి పులుసు రెడీ. ఇక గారెల కోసం మన ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పుని తీసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పప్పుని నీరు వేయకుండా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఈ గారెల కోసం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆ ఆయిల్ హీటెక్కిన తర్వాత ఈ గారాల మిశ్రమాన్ని చేతిలో వేసుకొని ఒక హోల్ పెట్టుకొని గారెల్ల వేసుకొని రెండు వైపులా ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి. అంతే ఇక గారెలు కూడా రెడీ. ఇక ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. నాటుకోడి, పులుసు గారెలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.