Home » Exclusive » Thotakura Sweet Corn Snacks Recipe In Telugu
Exclusive

Thotakura Snacks Recipe : ఎక్కువగా కష్టపడకుండా పిల్లలకి నచ్చేలా నోటికి రుచిగా ఈ స్నాక్స్ చేసి పెట్టండి…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: November 2, 2022 6:05 pm
Advertisement

Thotakura Snacks Recipe : సాయంత్రం పూట ఏదన్న తినాలి అనిపిస్తే ఇలా వేడివేడిగా తోటకూర, స్వీట్ కాన్ కలిపి మసాలా వడ చేసుకొని తినండి. చాలా బాగుంటాయండి టేస్ట్ భలే వచ్చాయి. ఎప్పుడు మిర్చి బజ్జి, బజ్జిలు, పునుగులు ఇలాంటివి కాకుండా ఇలా హెల్తీగా తోటకూర వడలు చేసి పిల్లలు పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. వీటిని టమాటా కెచప్ తో కానీ లేదా డైరెక్ట్ గా కాని తీసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి..దీనికి కావాల్సిన పదార్థాలు : తోటకూర, ఉల్లిపాయలు, స్వీట్ కాన్, పచ్చిమిర్చి కొత్తిమీర, ఉప్పు, జిలకర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, బియ్యప్పిండి సెనగపిండి, ఆయిల్, మొదలైనవి..

Advertisement

ముందుగా తోటకూర కట్టని తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో ఒక కప్పు స్వీట్ కాన్, నాలుగైదు పచ్చిమిర్చి వేసి మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఆ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి దాంట్లో ఒక కప్పు ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత రెండు స్పూన్ల శనగపిండి, రెండు స్పూన్ల బియ్యప్పిండి కూడా వేసి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర నీ కూడా వేసి నీళ్లు వేయకుండా కలుపుకోవాలి. ఒకవేళ పిండి లూస్ అయితే దానిలో రెండు స్పూన్ల శెనగపిండి కానీ బియ్యప్పిండి కానీ వేసి మళ్లీ కలుపుకోవాలి.

Thotakura sweet corn snacks recipe in telugu

Advertisement

అస్సలు నీళ్లు వేయొద్దు అలా కలుపుకున్న పిండిని కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని వడల్లా ఒత్తుకుంటూ ఆయిల్ లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. అలా చేసుకున్న వాటిని పేపర్ నాప్కిన్ లో వేసి ఆయిల్ అంత పీల్చుకునే వరకు ఉంచాలి. అంతే ఎంతో సింపుల్ గా నోటికి రుచిగా ఉండే స్నాక్ తోటకూర వడలు రెడీ. ఇవి సాయంత్రం వేళలో స్నాక్ గా తింటే చాలా బాగుంటాయి. వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూరలు తినని వాళ్లకి ఈ విధంగా పెడితే చాలా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి