Janaki Kalaganaledu 3 Nov Today Episode : మాధురిని చంపేసిన అఖిల్.. జ్ఞానాంబ మాటను లెక్కచేయకుండా అఖిల్ ను అరెస్ట్ చేయించిన జానకి

Janaki Kalaganaledu 3 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 నవంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 424 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అఖిల్ మాల్ అమ్మడానికి కాలేజీకి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్స్ కు డ్రగ్స్ గురించి చెప్పి మాల్ అమ్ముతాడు. అప్పుడే జానకి కూడా అదే కాలేజీలో సెమినార్ అటెండ్ అయి బయటికి వస్తుంది. ఇక.. కాలేజీలో తన ఫ్రెండ్స్ అందరికీ అవసరమైన వాళ్లకు మాల్ అమ్మి బాగానే డబ్బులు సంపాదిస్తాడు అఖిల్. ఇంతలో అఖిల్ వెనుక నుంచి చేయి వేస్తుంది మాధురి. తనను చూసి ముందు కంగారు పడతాడు. ఆ తర్వాత హాయ్ మాధురి నువ్వా అని అడుగుతాడు. దీంతో ఏం చేస్తున్నావు అఖిల్ ఇక్కడ అని అడుగుతుంది మాధురి. దీంతో ఏం చేయట్లేదు. ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా అంటాడు. అబద్ధాలు చెప్పకు అఖిల్. నువ్వేదో అమ్మకూడని వస్తువులు కాలేజీలో అమ్ముతున్నావు అది నేను చూశాను అంటుంది మాధురి. తన ఫ్రెండ్స్ కు మాల్ అమ్ముతుండగా మాధురి చూస్తుంది.

janaki kalaganaledu 3 november 2022 full episode

అదే విషయం చెబుతుంది మాధురి. ఏం మాట్లాడుతున్నావు మాధురి. నేను మాల్ అమ్మడానికి ట్రై చేయడం ఏంటి అంటాడు. దీంతో మాలా.. నేను మాల్ అని ఏం మాట్లాడలేదే అంటుంది. నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు అంటుంది మాధురి. దీంతో అదేం లేదు అంటాడు. ఎంత చెప్పినా కూడా వినదు మాధురి. నాకు అబద్ధం చెబుతున్నావా? నువ్వు రోజురోజుకూ దారుణాలు చేస్తున్నావు. మీ ఫ్యామిలీకి ఈ విషయం వెంటనే చెప్పాల్సిందే. నువ్వు చెడిపోతానంటే ఒక ఫ్రెండ్ గా చూస్తూ ఊరుకోను. మీ ఇంట్లో వాళ్లకు ఈ విషయం ఎలాగైనా చెప్పేస్తా అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తుంది మాధురి. దీంతో తన వెంట పరిగెడతాడు అఖిల్. తను ఎంత చెప్పినా మాధురి అస్సలు వినదు. నేనేం తప్పు చేయలేదు అన్నా కూడా అస్సలు వినకుండా మీ ఇంట్లో చెబుతా అంటుంది మాధురి.

ఇంతలో జానకి కాలేజీ నుంచి బయటికి వచ్చి అక్కడ నిలబడుతుంది. అప్పుడే మాధురి కూడా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. ఆగు మాధురి అంటూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడే అఖిల్ ను చూస్తుంది జానకి.

ఇప్పుడు ఆగకపోతే నిజంగానే చంపేస్తా అంటాడు అఖిల్. అది విని జానకి షాక్ అవుతుంది. అఖిల్ అని అనుకొని అఖిల్ అంటూ తన వెంట పరుగెడుతుంది జానకి. తన వెనుక పరిగెత్తుతాడు అఖిల్.

Janaki Kalaganaledu 3 Nov Today Episode : అఖిల్ బ్యాగును చూసి మాధురి ఎక్కడుందో తెలుసుకున్న జానకి

మాధురి అస్సలు ఆగదు. మాధురి వెనుక అఖిల్, అఖిల్ వెనుక జానకి పరిగెడుతూ ఉంటారు. ఇక లాభం లేదనుకొని అక్కడే ఉన్న ఒక కర్రను తీసుకొని తన మీదికి విసిరేస్తాడు అఖిల్. దీతో మాధురి అక్కడే కింద పడిపోతుంది.

తనను కొట్టడం వెనుకే ఉన్న జానకి చూస్తుంది. షాక్ అవుతుంది. మాధురి తల నుంచి రక్తం కారుతుంది. లేచి నిలబడటానికి ప్రయత్నిస్తుంది మాధురి. లేచి తలకు రక్తం కారుతున్నా అక్కడి నుంచి పరుగెడుతుంది.

అఖిల్ నుంచి తప్పించుకోవడం కోసం అటూ ఇటూ పరిగెత్తి చివరకు ఒక చోట పడిపోతుంది. తన దగ్గరికి వెళ్లి చూసేసరికి మాధురి చనిపోయి ఉంటుంది. తన తలకు బలంగా గాయం అయి ఉంటుంది.

ఎంత లేపినా తను లేవదు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు అఖిల్. ఇంతలో అఖిల్ బ్యాగు కనిపిస్తుంది జానకికి. దీంతో అటూ ఇటూ చూస్తుంది. దీంతో పక్కనే మాధురి కనిపిస్తుంది. తన దగ్గరికి వెళ్తుంది. మాధురి కళ్లు తెరువు అంటే అస్సలు తెరవదు. తర్వాత కాసేపు శ్వాస తీసుకుంటుంది మాధురి.

మరోవైపు అఖిల్ తన ఫ్రెండ్ బైక్ మీద ఇంటికి వస్తాడు. కానీ.. ఇంటికి వచ్చేముందు తన చేతి మీద ఉన్న రక్తపు మరకలను తూడ్చేసుకొని వస్తుంటాడు. అప్పుడే జ్ఞానాంబ, గోవిందరాజు ఇద్దరూ బయటికి వెళ్తుంటారు.

అస్సలు టెన్షన్ పడకూడదు అని అనుకుంటాడు. జ్ఞానాంబ, గోవిందరాజు ఇద్దరినీ దాటుకుంటూ లోపలికి వెళ్తుంటాడు అఖిల్. ఇంతలో గోవిందరాజు ఒరేయ్ అఖిల్ అని పిలుస్తాడు.

దీంతో తన దగ్గరికి వెళ్తాడు అఖిల్. ఎక్కడికి వెళ్లివస్తున్నావు అని అడుగుతాడు. దీంతో తెలిసో తెలియకో ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. కానీ.. ఇక నుంచి మీకు మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా. అందుకే బుక్స్ కూడా కొనుక్కొని వస్తున్నా అంటాడు అఖిల్.

మీరు నా మాట నమ్మరని తెలుసు నాన్న. కానీ.. నేను మారాను నాన్న. ఇక నుంచి మంచిగా మాత్రమే ఉంటాను అమ్మ అని చెప్పి లోపలికి వెళ్తాడు అఖిల్. ఇక తప్పించుకున్నాను అని అనుకుంటాడు అఖిల్.

అప్పుడే జెస్సీ వస్తుంది. ఎంతసేపు అయింది అఖిల్ వచ్చి అని అడుగుతుంది. దీంతో ఇప్పుడే వచ్చాను అంటాడు అఖిల్. ఇక నుంచి టైమ్ వేస్ట్ చేయను అని అంటాడు అఖిల్. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు జాబ్ చేస్తాను అంటాడు అఖిల్.

మరోవైపు మాధురిని హాస్పిటల్ లో చేర్పిస్తుంది జానకి. ఆ తర్వాత ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

26 minutes ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

1 hour ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

2 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

3 hours ago

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…

4 hours ago

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

5 hours ago

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

6 hours ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

7 hours ago