Categories: HealthNews

Smoker : ధూమపానం చేసే అలవాటు ఉన్నవారు… కచ్చితంగా చేయించుకోవలసిన వైద్య పరీక్షలు…!

Smoker :  ధూమపానం అనేది ఆరోగ్యానికి ఎంతో హానికరం అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన ఈ వ్యసనానికి బానిసలవుతున్న వారి సంఖ్య నానాటికి బాగా పెరిగిపోతుంది. మీకు ధూమపానం చేసే అలవాటు గనుక ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా కచ్చితంగా కొన్ని పరీక్షలను చేయించుకోవాలి. చేయించుకోవలసిన ఆ పరీక్షలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధూమపానం అనేది మన ఆరోగ్యానికి ఎంతో హానికరం అనే సంగతి అందరికీ తెలుసు. కానీ సిగరెట్ ప్యాకెట్ పై కూడా దీని గురించి రాసే ఉంటుంది. దీనిని చదివినా కూడా దానిని చాలా మంది సీరియస్ గా అస్సలు తీసుకోరు. అలాగే గ్లోబల్ యాక్షన్ టు అండ్ స్మోకింగ్ రిలీజ్ చేసిన ఒక పత్రిక ప్రకటన ప్రకారం చూస్తే, ప్రపంచంలో ధూమపానం చేసే వారి సంఖ్య భారతదేశం లోనే ఎక్కువగా ఉన్నది. అయితే 2019లో 8.5% మంది యువకులు దుమపానం చేశారు. అయితే మీరు గనక ధూమపానం చేస్తుంటే మీ శరీరంపై ధూమపానం యొక్క ప్రభావాలను పరీక్షించుకోవడానికి నిత్యం ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. అలాగే ప్రతి ధూమపానం చేసే వ్యక్తి చేయించుకోవలసిన వైద్య పరీక్షల జాబితాను కర్ణాటకకు చెందినటువంటి డాక్టర్ మీనాక్షి మోహన్ తెలిపారు. అయితే ధూమపానం ఎన్నో వ్యాధుల ప్రమాదాలను పెంచగలదు. ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు గుండె లేక మొత్తం శ్వాసకోస వ్యవస్థను కూడా ప్రభావితం చేయగలదు…

Smoker స్పేరోమెట్రి

ఈ పరీక్ష అనేది మీ ఊపిరితిత్తులు ఎంత బాగా పని చేస్తున్నాయో కొలుస్తుంది. అలాగే ఈ సాధారణ శ్వాస పరీక్ష రోగి యొక్క ఊపిరితిత్తుల లోపల మరియు వెలుపల ఎంత గాలి ఆడుతుందో కూడా పరీక్షించేందుకు సహాయం చేస్తుంది. అంతేకాక ముఖ్యంగా ధూమపానం చేసేవారిలో సిఓ పిడి లాంటి వ్యాధులను కూడా ముందుగానే గుర్తించడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ సిఓ పిడి అనగా శ్వాసనాళం లేక ఊపిరితిత్తుల యొక్క వివిధ భాగాలకు నష్టం. ఈ నష్టం గాలి యొక్క ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. అలాగే శ్వాస ను తీసుకోవడం లో ఎంతో కష్టతరం చేస్తుంది…

సిటీ స్కాన్ : ధూమపానం చేసేవారు ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారు లేక దీర్ఘకాలిక ధూమపానం చేసేవారు అయినట్లయితే ఊపితిత్తుల క్యాన్సర్ ను తగ్గించడానికి వార్షిక తక్కువ మోతాదు సిటీ స్కాన్ చేయించుకోవాలి అని వైద్యులు సిఫారస్ చేస్తున్నారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి ముఖ్య సమస్యలను గుర్తించటంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ ను మొదట దశలోని గుర్తించేందుకు మరియు దాని ప్రమాదాలను తగ్గించేందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ స్కాన్ అనేది మీ ఊపిరితిత్తుల యొక్క వివరణాత్మక చిత్రాన్ని కూడా ఇస్తుంది…

కార్డియాక్ స్క్రినింగ్ : ధూమపానం గుండె సంబంధించిన వ్యాధులకు ముఖ్య కారణాలలో ఒకటి. అయితే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ మరియు లిపిడ్ ప్రొఫైల్ మరియు రక్తపోటు పర్యవేక్షణ లాంటి వార్షిక కార్డియాక్ లాంటివి వీటిలో ఉన్నాయి. ఈ పరీక్షలు మీ గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయటంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే ధూమపానం చేసేవారిలో అధికంగా కనిపించే కొరోనరీ ఆర్టరీ వ్యాధి మరియు రక్త పోటు లేక అరిథ్మియాను గుర్తించడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది…

కంప్లీట్ బ్లడ్ కౌంట్ : ధూమపానం వలన మీ రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య అనేది తగ్గుతుంది. దీంతో మంట లేక హిమోగ్లోబిన్ స్థాయిలలో మార్పులు లాంటి అసాధారణ తలను ఈ సిబిసి పరీక్ష గుర్తిస్తుంది…

ఓరల్ క్యాన్సర్ స్క్రినింగ్ : ధూమపానం చేసేవారిలో నోటి క్యాన్సర్ ప్రమాదాలు బాగా పెరుగుతాయి. అందుకే దంత వైద్యుడు లేక పరిశుభ్రత నిపుణుడు వార్షిక నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ లాంటి వాటిని కలిగి ఉండాలి. ఇది నోరు మరియు గొంతు లేక నాలుకలోని క్యాన్సర్ గాయాలను ముందే గుర్తిస్తుంది. దీంతో వాటికి చికిత్స చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది…

Smoker : ధూమపానం చేసే అలవాటు ఉన్నవారు… కచ్చితంగా చేయించుకోవలసిన వైద్య పరీక్షలు…!

లివర్ ఫంక్షన్ టెస్ట్ : ధూమపానం చేసేవారిలో ముఖ్యంగా మద్యం సేవించే వారిలో కాలేయ పనితీరు అనేది ఎంతగానో దెబ్బతింటుంది. అందుకే వార్షిక ఎల్ఎఫ్టి పరీక్ష కాలేయ నష్టాన్ని ముందే గుర్తిస్తుంది. అలాగే ముందుగా చికిత్స చేసేందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది…

Recent Posts

Telangana Education Sector: తెలంగాణ విద్యా రంగం విషయంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Telangana Education Sector : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని పాఠశాలలు,…

1 hour ago

Lokesh & Ram Mohan Naidu : లోకేష్ ..రామ్మోహన్ నాయుడు లను చూస్తే అన్నదమ్ములు కూడా ఇంత అన్యోన్యంగా ఉండరేమో !!

Lokesh & Ram Mohan Naidu : తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఒక పెద్ద కుటుంబంలా కొనసాగుతూ వస్తోంది.…

2 hours ago

Rushikonda Jagan Palace : కూలుతున్న జగన్ ప్యాలెస్..ప్రజల సొమ్ము నీళ్లపాలు..?

విశాఖపట్నం పర్యటనలో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రుషికొండలో గత ప్రభుత్వ కాలంలో నిర్మించిన విలాసవంతమైన…

6 hours ago

Chiranjeevi | సైకిల్‌పై వందల కిలోమీటర్లు ప్రయాణించిన అభిమాని.. రాజేశ్వరి‌కు మెగాస్టార్‌ చిరంజీవి అండ

Chiranjeevi | అభిమానం హద్దులు దాటి, జీవితాన్నే పణంగా పెట్టి తన అభిమాన నటుడిని కలవాలని పట్టుదలగా ప్రయత్నించిన ఓ మహిళా…

7 hours ago

War 2 | వార్ 2 ఓటీటీ టైం ఫిక్స్ అయిన‌ట్టేనా.. స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుండి అంటే..!

War 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…

8 hours ago

Barrelakka | మ‌ళ్లీ వార్త‌ల‌లోకి బ‌ర్రెల‌క్క‌.. ఈ సారి ఏం చేసిందంటే..!

Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అంద‌రి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మ‌రోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.…

9 hours ago

Hansika | హ‌న్సిక విడాకుల‌పై వ‌చ్చిన క్లారిటీ.. ఈ పోస్ట్‌తో ఫిక్స్ అయిన ఫ్యాన్స్

Hansika | స్టార్ హీరోయిన్‌ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న…

10 hours ago

LOBO | బిగ్ బాస్ ఫేమ్ లోబోకి ఏడాది జైలు శిక్ష‌.. ఏం త‌ప్పు చేశాడంటే..!

LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…

11 hours ago