మనం స్టవ్ పైన పాలు గాని టీ కానీ పెట్టి మర్చిపోతూ ఉంటాం.. అవి ఫుల్ గా మాడిపోతు ఉంటాయి. ఒక్కొక్కసారి అవి మళ్ళా కొత్త దానిలా ఎలా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే మాడిపోయిన గిన్నెలు హాఫ్ లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. తర్వాత దానిలో ఒక స్పూను వంటసోడా వేసుకోవాలండి. వేసి ఒకసారి బాగా కలపాలి. అది వేయగానే కొంచెం నురగ లాగా వస్తది. నెక్స్ట్ రెండు కప్పుల వెనిగర్ వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండిటిని బాగా కలుపుకోవాలి. వెనిగర్ ని ఫుడ్ లో వాడడానికి తీసుకుంటారండి. ఈ వెనిగర్ ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ పై పెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేంతవరకు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి.
మెల్లమెల్లగా మరగడం స్టార్ట్ అయి. పొంగు వస్తుంది అనగానే వెంటనే సింలో పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ గాని ఒక గరిట గాని తీసుకొని ఆ కలుపుతూ ఉండాలి. ఆ లోపల గట్టిగా అంటూ పెట్టుకొని ఉంది కదండి మొత్తం మాడిపోయింది అది మొత్తం గరిటతో లాగుతూ ఉంటే మొత్తం అంతా వచ్చేస్తది. పైనున్న అంచులు కూడా ఉంది కదా అంచులు దాని పైన కూడా కొద్దికొద్దిగా వాటర్ వేసుకొని అలా చేస్తూ ఉంటే మొత్తం అంతా వచ్చేస్తది. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడే అదంతా తీయడానికి ట్రై చేయాలండి. చాలా తేలిగ్గానే క్లీన్ అవుతుంది. మరుగుతున్నప్పుడే గట్టుతో గట్టిగా లాగుతూ ఉంటే మొత్తం అన్ని వచ్చేస్తాయి. మాడిందంతా వచ్చేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.
తర్వాత ఈ వాటర్ ని చల్లగా అయ్యే వరకు అలా వదిలేయాలి. ఇదంతా మరగడానికి 15 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న వాటర్ ని వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాం. ఈ ఫిల్టర్ చేసుకున్న వాటర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట కూడా మాడింది కదండీ దానిపైన ఈ ఫిల్టర్ చేసుకున్న వాటర్ ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేయాలి. ఇటువంటి గిన్నెలు మాడినప్పుడు రూమ్ అంతా స్మెల్ అనేది వస్తుంది కదా అండి.. ఆ స్మెల్ అంత పోవాలంటే కొద్దిగా వాటర్ లో వెనిగర్ వేసి రూమ్ అంతా క్లీన్ చేసుకుంటే ఆ చెడు వాసనవి పోతాయి.
ఇప్పుడు గిన్నెలు తోముకుని సోప్ ఉంటది కదండీ ఆ సోప్ తో స్క్రబ్బర్ తో గట్టిగా అడిచిపెట్టి క్లీన్ చేసుకోవాలి. ఇలా లోపల బయట తోముకుంటే మొత్తం అంత వచ్చేస్తదండి. మరో సింపుల్ చిట్కా..
కూల్ డ్రింక్స్ ని మాడిపోయిన గిన్నెలో పోసి బాగా మరిగించాలి. అలా మరిగిన తర్వాత దించి డిష్ వాష్ స్క్రబ్బర్తో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మాడిపోయిన గిన్నెలు చక్కగా శుభ్రం అవుతాయి…
అలాగే స్టీల్ గిన్నెలను క్లీన్ చేయడంలో టమోటా సాస్ బాగా ఉపయోగపడుతుంది. ఓ చెంచా టమాటా సాస్ ను తీసుకొని మురికిగా ఉన్న గిన్నెలకు రుద్ది రాత్రంతా అలానే ఉంచాలి. దీనిలో యాసిడ్ మొండి మరకల్ని శుభ్రం చేస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.