TEA : రోజు రోజుకి చాయ్ ప్రియుల సంఖ్య పెరిగిపోతోంది.. ఉదయం లేచిన దగ్గరనుంచి సాయంత్రం వరకు గంటకొకసారి చాయ్ తాగకపోతే ఏ పని సాగదు. అయితే ఇంకొంతమంది రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారో మనం చెప్పలేం.. అయితే ఈ టీ అలవాటు శరీరానికి ప్రమాదం కలిగిస్తుంది. ఎందుకనగా దీనిలో ఉండే చక్కెర మధుమేహం, ఊబకాయం లాంటి ప్రమాదాలను పెంచుతున్నాయి. అలాగే పరిమితికి మించి త్రాగడం వలన ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. అయితే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. కావున దీనికి కూడా ఒక పరిష్కారం అనేది ఉన్నది.
అదేమిటి అంటే టీలో చక్కెరకి బదులుగా బెల్లం కలపాలి. శరీరానికి ఈ బెల్లం వలన ఎటువంటి ప్రమాదం ఉండదు. మీరు టీ మర్చిపోలేక పోతుంటే దీని తయారు చేసే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. టీలో పంచదార బదులుగా బెల్లం కలుపుకోవాలి. దీని వలన శరీరంలో ఎన్నో గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి… ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… రక్తహీనత కంట్రోల్ : చాలామందికి వయసు పెరిగే కొద్దీ రక్తహీనత సమస్య ప్రారంభమవుతుంది. దీంతో బాధపడే వారు సాధారణ పని చేయడంలో సమస్యలు వస్తుంటాయి.
అటువంటి పరిస్థితిలో బెల్లం టీ తాగినట్లయితే దీనిలో ఉండే ఐరన్ శరీరంలోకి రక్త లోపాన్ని తగ్గిస్తుంది.. జీర్ణ క్రియ: టీలో బెల్లం కలపడం వలన జీర్ణ క్రియ బాగా మెరుగుపడుతుంది. దీనివల్ల ఎటువంటి పొట్ట సమస్యలు ఉండవు. బెల్లంలో ఉండే విటమిన్లు, మినరల్స్ అన్ని విధాల ఆరోగ్య ప్రయోజనాలు కలగజేస్తాయి.. బరువు తగ్గుతారు : టీలో చక్కెర కలుపుకొని తాగడం వలన బెల్లీ ఫ్యాట్ బరువు పెరిగిపోతూ ఉంటారు. అయితే బదులుగా బెల్లం కలిపినట్లయితే దాన్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.