Mosquitoes : ఇంట్లో దోమలు సహజంగా ఉంటూనే ఉంటాయి. అయితే వర్షాకాలం వచ్చిందంటే ఈ దోమల బెడద ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ దోమలు కుట్టడం వల్ల ఎన్నో రకాల రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, లాంటివి వస్తూ ఉంటాయి. ఇటువంటి దోమల నుంచి మనం బయటపడడానికి ఎన్నో రకాల కెమికల్స్ ఉండే స్ప్రేలు వాడుతూ ఉంటాం. కానీ వాటి వలన ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్ టిప్స్ ద్వారా ఈ దోమలు ని పరార్ చేయవచ్చు. ఈ చిట్కాలు వాడినట్లయితే ఇంట్లో ఒక దోమ కూడా ఉండదు.. మొదటి చిట్కా కర్పూరం కలిపిన నూనె, మట్టి ప్రమిదలో వేసి దీపం వెలిగించడం వలన ఎక్కువ పొగ వస్తూ ఉంటుంది. ఈ పొగకు దోమలు అన్ని పరారవుతాయి.
పడుకోడానికి ఒక గంట ముందు ఈ దీపం పెట్టి తలుపులు మూయాలి. ఈ విధంగా చేసినట్లయితే దోమలన్నీ పరారవుతాయి. మూడవ చిట్కా వెల్లులి రెమ్మలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు కొబ్బరి నూనెలు వేసి బాగా మరగపెట్టాలి. ఎల్లులో ఉండే ఔషధ గుణాలన్నీ కొబ్బరి నూనెలో దిగుతాయి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి దానిని చల్లార్చిన తర్వాత దాన్ని గాజు సీసాలో భద్రపరచుకోవాలి. దీనిని నిత్యము పడుకునే ముందు కాళ్లు మరియు చేతులకు రాసుకోవడం వలన దోమలు కుట్టకుండా ఉంటాయి. ఈ ఆయిల్ నైట్ డ్యూటీలు చేసే వారికి చాలా బాగా సహాయపడుతుంది.
వెల్లుల్లి వాసన మనకు తినడానికి బాగానే అనిపిస్తుంది. కానీ దోమలకి వాసన అసలు గిట్టదు. వెల్లుల్లి వాసన రావడం వలన దోమలు చుట్టుపక్కల కూడా ఉండవు…
ఇక మూడవ చిట్కా వేప నూనె మూడు చెంచాలు తీసుకొని ఒక చెంచాడు కర్పూరం వేసి బాగా కలపాలి. బిర్యానీ ఆకులు రెండు కూడా ఇందులో తీసుకొని ఈ నూనె బిర్యానీ ఆకులు పైన రాయాలి. తర్వాత దోమలు ఉన్న గదిలో బిర్యానీ ఆకులను కాల్చి పెట్టాలి. ఈ విధంగా కాల్చడం వలన బాగా పొగ వస్తుంది. కర్పూరం వేప నూనె వాసన దోమలకి అస్సలు పడదు. ఈ పొగకు దోమలన్నీ పరారవుతాయి. వేప నూనె అన్ని పచారి షాపులలో దొరుకుతూ ఉంటుంది. నాలుగోది వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసి 15 నిమిషాలు బాగా మరగబెట్టుకోవాలి. ఈ నీటిని తర్వాత వడకట్టి స్ప్రే బాటిల్ లో పోసుకొని ఈ వాటర్ ని దోమలున్న చోట స్ప్రే చేస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం వలన దోమలన్నీ చచ్చిపోతాయి..
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.