Mosquitoes : ఇంట్లో ఉన్న దోమలు అన్ని కూడా ఎటువంటి కెమికల్స్ వాడకుండా పరార్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mosquitoes : ఇంట్లో ఉన్న దోమలు అన్ని కూడా ఎటువంటి కెమికల్స్ వాడకుండా పరార్…!!

Mosquitoes : ఇంట్లో దోమలు సహజంగా ఉంటూనే ఉంటాయి. అయితే వర్షాకాలం వచ్చిందంటే ఈ దోమల బెడద ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ దోమలు కుట్టడం వల్ల ఎన్నో రకాల రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, లాంటివి వస్తూ ఉంటాయి. ఇటువంటి దోమల నుంచి మనం బయటపడడానికి ఎన్నో రకాల కెమికల్స్ ఉండే స్ప్రేలు వాడుతూ ఉంటాం. కానీ వాటి వలన ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి కెమికల్స్ లేకుండా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 January 2023,6:00 am

Mosquitoes : ఇంట్లో దోమలు సహజంగా ఉంటూనే ఉంటాయి. అయితే వర్షాకాలం వచ్చిందంటే ఈ దోమల బెడద ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ దోమలు కుట్టడం వల్ల ఎన్నో రకాల రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, లాంటివి వస్తూ ఉంటాయి. ఇటువంటి దోమల నుంచి మనం బయటపడడానికి ఎన్నో రకాల కెమికల్స్ ఉండే స్ప్రేలు వాడుతూ ఉంటాం. కానీ వాటి వలన ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్ టిప్స్ ద్వారా ఈ దోమలు ని పరార్ చేయవచ్చు. ఈ చిట్కాలు వాడినట్లయితే ఇంట్లో ఒక దోమ కూడా ఉండదు.. మొదటి చిట్కా కర్పూరం కలిపిన నూనె, మట్టి ప్రమిదలో వేసి దీపం వెలిగించడం వలన ఎక్కువ పొగ వస్తూ ఉంటుంది. ఈ పొగకు దోమలు అన్ని పరారవుతాయి.

పడుకోడానికి ఒక గంట ముందు ఈ దీపం పెట్టి తలుపులు మూయాలి. ఈ విధంగా చేసినట్లయితే దోమలన్నీ పరారవుతాయి. మూడవ చిట్కా వెల్లులి రెమ్మలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు కొబ్బరి నూనెలు వేసి బాగా మరగపెట్టాలి. ఎల్లులో ఉండే ఔషధ గుణాలన్నీ కొబ్బరి నూనెలో దిగుతాయి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి దానిని చల్లార్చిన తర్వాత దాన్ని గాజు సీసాలో భద్రపరచుకోవాలి. దీనిని నిత్యము పడుకునే ముందు కాళ్లు మరియు చేతులకు రాసుకోవడం వలన దోమలు కుట్టకుండా ఉంటాయి. ఈ ఆయిల్ నైట్ డ్యూటీలు చేసే వారికి చాలా బాగా సహాయపడుతుంది.
వెల్లుల్లి వాసన మనకు తినడానికి బాగానే అనిపిస్తుంది. కానీ దోమలకి వాసన అసలు గిట్టదు. వెల్లుల్లి వాసన రావడం వలన దోమలు చుట్టుపక్కల కూడా ఉండవు…

All the mosquitoes in the house can escape without using any chemicals

All the mosquitoes in the house can escape without using any chemicals

ఇక మూడవ చిట్కా వేప నూనె మూడు చెంచాలు తీసుకొని ఒక చెంచాడు కర్పూరం వేసి బాగా కలపాలి. బిర్యానీ ఆకులు రెండు కూడా ఇందులో తీసుకొని ఈ నూనె బిర్యానీ ఆకులు పైన రాయాలి. తర్వాత దోమలు ఉన్న గదిలో బిర్యానీ ఆకులను కాల్చి పెట్టాలి. ఈ విధంగా కాల్చడం వలన బాగా పొగ వస్తుంది. కర్పూరం వేప నూనె వాసన దోమలకి అస్సలు పడదు. ఈ పొగకు దోమలన్నీ పరారవుతాయి. వేప నూనె అన్ని పచారి షాపులలో దొరుకుతూ ఉంటుంది. నాలుగోది వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాసు నీళ్లు పోసి 15 నిమిషాలు బాగా మరగబెట్టుకోవాలి. ఈ నీటిని తర్వాత వడకట్టి స్ప్రే బాటిల్ లో పోసుకొని ఈ వాటర్ ని దోమలున్న చోట స్ప్రే చేస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం వలన దోమలన్నీ చచ్చిపోతాయి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది