Amazing Health Benefits Of Sprouts
Health Benefits : మొలకెత్తిన గింజలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మామూలుగా గింజలు ఉడికించి తినడం కంటే కూడా.. అవి మొలకెత్తిన తర్వాత వాటిని తింటే ఎన్నో పోషకాలు లభిస్తాయి. గింజలను నీటిలో నానబెట్టి.. ఆ తర్వాత ఓ తడి వస్త్రంలో కట్టి ఓ రాత్రంతా అలా వదిలేస్తే గింజలకు మొలకలు వస్తాయి. ఇలా మొలకలు వచ్చిన మొలకల గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆ గింజలను అలాగే పచ్చిగా తినడం వల్ల వాటిలో పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి. అయితే మొలకెత్తిన విత్తనాలతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయినప్పటికీ వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. మొలకెత్తిన గింజలు అనగానే దూరం జరుగుతారు. మొలకలు తింటే జీర్ణక్రియ సక్రమంగా జరగదని భయపడతారు. అందుకే అల్పాహారంలో వాటిని భాగం చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టం చూపించరు. వాటికి బదులు అల్పాహారంలో ఇడ్లీ, దోశ వంటివి తీసుకుంటున్నారు.
ఇలా ఉడికించిన ఆహారం ద్వారా రెంు విధాలుగా మనకి నష్టం కలుగుతుంది.మొదటిది ఉడికించిన ఆహారంలో వాటి పోషకాలను కోల్పోవడం జరుగుతుంది. రెండోది భోజనంలో ఉప్పు మరియు నూనె ఉపయోగించడం ద్వారా మనకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల అల్పాహారంలో మొలకలు బదులు మరికొన్ని విత్తనాలను చేర్చుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేరుశెనగలు, పుచ్చ పప్పు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, బాదం, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటివి చౌక ధరలకు లభించే గింజలను వాడుకోవచ్చు. ఈ గింజలను ఒక్కొక్కటిగా గుప్పెడు గింజలను వేర్వేరుగా ముందు రోజు రాత్రి నానబెట్టాలి. తర్వాతి రోజు ఉదయం అల్పాహారంలో వాటిని భాగం చేసుకోవాలి. ఈ గింజలను అల్పాహారంలో భాగంగా తినడం వల్ల చ్లా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు వల్ల కలిగే ప్రయోజనాలే ఈ విత్తనాలు తినడం వల్ల కూడా అందుతాయి.
Amazing Health Benefits Of Sprouts
ఈ గింజలను బరువు పెరగాలనుకుంటున్న వారు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలా పుష్కలంగా ఉంటాయి.అధిక బరువు ఉన్న వాళ్లు ఇవి సమ మోతాదులో తీసుకుంటే వారికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. వేరు శెనగలో ఉన్న ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. మరియు జీర్ణక్రియలో సమతుల్యతను ఏర్పరుస్తుంది. పల్లిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్ తో పోరాడతాయి. అలాగే క్యాన్సర్ రాకుండా ఇవి అడ్డుకుంటాయి. పుచ్చ గింజల్లో అనేక విలువలు ఉంటాయి. వేరుశెనగల్లో విటమిన్-బి అధికంగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం లల్ల గుండె జబ్బుల ముప్పు నుండి తప్పించుకోవచ్చు. ఈ గింజలు తీసుకోవడంతో మూత్రంలో ఇన్ఫెక్షన్ తగ్గు ముఖం పడుతుంది. గుమ్మడి గింజల విత్తనాలను తీసుకుంటే ఎముకలు కూడా చాలా బలంగా తయారు అవుతాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.