amazing health benifit to reduce knee pains
Health Benefits : వావిలాకు గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే పురాతన కాలం నుంచే మనం ఎన్నో వైద్య చికిత్సల కోసం ఈ వావిలాకును వినియోగిస్తున్నాం. ముఖ్యంగా డెలివరీ అయిన స్త్రీలకు ఆ ఆకులను నీటిలో వేసి మరిగించి స్నానం చేయిస్తుంటారు. బిడ్డ పుట్టిన తర్వాత స్త్రీ శరీరం అంతా నొప్పులతో పండులా మారుతుంది. అయితే ఆ నొప్పుల నుంచి ఉపశమనం కల్గించేందుకు మన పెద్దలు వావిలాకును వాడే వారు. అయితే వావిలాకు వేసి మరిగించిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని నొప్పులు తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు కూడా రుజువు చేశాయి. అయితే కేవలం డెలివరీ అయిన స్త్రీలకే కాకుండా వావిలాకు అందరికీ ఉపయోగ పడుతుంది.
అయితే వావిలాకు వల్ల కల్గే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.పరిపక్వమైన వావిలాకులను తీసుకొని చక్కటి పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని కొంచెం వేడి చేసి వాపు ఉన్న ప్రదేశంలో పెట్టి కాపడం వల్ల నొప్పి తగ్గుతుంది. అలాగే ఆకు కషాయాలను రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల దగ్గు, గొంతు చికాకు, జ్వరం, యూఆర్టీఐ మొదలైనవి పూర్తిగా తగ్గిపోతాయట. అంతే కాదండోయ్ ఒక టేబుల్ స్పూన్ వావిలాకు పొడిని.. రెండు కప్పుల నీటితో కలిపి, ఉడకబెట్టి అర కప్పుకు తగ్గించి ఫిల్టర్ చేసి ఈ వావిలాకు కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే తాజాగా తయారు చేసిన ఆకు కషాయాలు గాయాలను కడగడానికి ఉపయోగిస్తారు. ఇది పండ్లు, గాయాలు వంటివి త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
amazing health benefits to reduce knee pains
వావిలాకు పొడితో పళ్లు తోముకోవడం లేదా వావిలాకు కషాయం నోట్లో వేసుకొని పుక్కిలించడం వంటివి చేయడం వల్ల నాసికా స్రావం, నాసికా పాలిప్స్ తగ్గుతాయట. ముఖ్యంగా గొంతుకు, నోటికి సంబంధించిన అనేక రోగాలను దూరం చేస్తుందట50 గ్రాముల నిర్గుండి ఆకులు, 200 మి.లీ నువ్వుల నూనె, 800మి.లీ నీరు లేదా ఆకు డికాషన్ కలిపి నూనెను తయారు చేస్తారు. ఈ నూనెను కీళ్లు, మోకాళ్లు, శరీరంలోని ఇతర భాగాల వద్ద నొప్పులు వచ్చినప్పుడు వాడుతుంటారు. దీన్ని నొప్పి ఉన్న చోట రాసి మర్దనా చేయడం వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే చీము కారే, నయం కాని గాయాలు, కండరాల నొప్పులు, దృఢత్వం, నొప్పి, ఆర్థరైటిస్, ఆసన ఫిస్టులా వంటి రోగాలను కూడా తరిమికొడుతుంది.
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్నెస్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
This website uses cookies.