Health Benefits : వావిలాకులతో పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కు చెప్పండి బైబై..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : వావిలాకులతో పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కు చెప్పండి బైబై..!

Health Benefits : వావిలాకు గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే పురాతన కాలం నుంచే మనం ఎన్నో వైద్య చికిత్సల కోసం ఈ వావిలాకును వినియోగిస్తున్నాం. ముఖ్యంగా డెలివరీ అయిన స్త్రీలకు ఆ ఆకులను నీటిలో వేసి మరిగించి స్నానం చేయిస్తుంటారు. బిడ్డ పుట్టిన తర్వాత స్త్రీ శరీరం అంతా నొప్పులతో పండులా మారుతుంది. అయితే ఆ నొప్పుల నుంచి ఉపశమనం కల్గించేందుకు మన పెద్దలు వావిలాకును వాడే వారు. అయితే వావిలాకు […]

 Authored By pavan | The Telugu News | Updated on :2 April 2022,2:00 pm

Health Benefits : వావిలాకు గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే పురాతన కాలం నుంచే మనం ఎన్నో వైద్య చికిత్సల కోసం ఈ వావిలాకును వినియోగిస్తున్నాం. ముఖ్యంగా డెలివరీ అయిన స్త్రీలకు ఆ ఆకులను నీటిలో వేసి మరిగించి స్నానం చేయిస్తుంటారు. బిడ్డ పుట్టిన తర్వాత స్త్రీ శరీరం అంతా నొప్పులతో పండులా మారుతుంది. అయితే ఆ నొప్పుల నుంచి ఉపశమనం కల్గించేందుకు మన పెద్దలు వావిలాకును వాడే వారు. అయితే వావిలాకు వేసి మరిగించిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని నొప్పులు తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు కూడా రుజువు చేశాయి. అయితే కేవలం డెలివరీ అయిన స్త్రీలకే కాకుండా వావిలాకు అందరికీ ఉపయోగ పడుతుంది.

అయితే వావిలాకు వల్ల కల్గే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.పరిపక్వమైన వావిలాకులను తీసుకొని చక్కటి పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని కొంచెం వేడి చేసి వాపు ఉన్న ప్రదేశంలో పెట్టి కాపడం వల్ల నొప్పి తగ్గుతుంది. అలాగే ఆకు కషాయాలను రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల దగ్గు, గొంతు చికాకు, జ్వరం, యూఆర్టీఐ మొదలైనవి పూర్తిగా తగ్గిపోతాయట. అంతే కాదండోయ్ ఒక టేబుల్ స్పూన్ వావిలాకు పొడిని.. రెండు కప్పుల నీటితో కలిపి, ఉడకబెట్టి అర కప్పుకు తగ్గించి ఫిల్టర్ చేసి ఈ వావిలాకు కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే తాజాగా తయారు చేసిన ఆకు కషాయాలు గాయాలను కడగడానికి ఉపయోగిస్తారు. ఇది పండ్లు, గాయాలు వంటివి త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

amazing health benifit to reduce knee pains

amazing health benefits to reduce knee pains

వావిలాకు పొడితో పళ్లు తోముకోవడం లేదా వావిలాకు కషాయం నోట్లో వేసుకొని పుక్కిలించడం వంటివి చేయడం వల్ల నాసికా స్రావం, నాసికా పాలిప్స్ తగ్గుతాయట. ముఖ్యంగా గొంతుకు, నోటికి సంబంధించిన అనేక రోగాలను దూరం చేస్తుందట50 గ్రాముల నిర్గుండి ఆకులు, 200 మి.లీ నువ్వుల నూనె, 800మి.లీ నీరు లేదా ఆకు డికాషన్ కలిపి నూనెను తయారు చేస్తారు. ఈ నూనెను కీళ్లు, మోకాళ్లు, శరీరంలోని ఇతర భాగాల వద్ద నొప్పులు వచ్చినప్పుడు వాడుతుంటారు. దీన్ని నొప్పి ఉన్న చోట రాసి మర్దనా చేయడం వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే చీము కారే, నయం కాని గాయాలు, కండరాల నొప్పులు, దృఢత్వం, నొప్పి, ఆర్థరైటిస్, ఆసన ఫిస్టులా వంటి రోగాలను కూడా తరిమికొడుతుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది