Hair Tips : చలికాలంలో చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.? ఈ సులభమైన టిప్స్ తో తగ్గించుకోవచ్చు…!!
Hair Tips : అందరూ చలికాలంలో చుండ్రు సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. చలికాలంలో ఎక్కువగా వచ్చే సమస్యల్లో చుండ్రు ఒకటి. అయితే ఈ చుండ్రు కు కారణం వాతావరణం లో మార్పులు, పోషకాహార లేని ఇంకా ఎన్నో కారణాల వలన ఈ సమస్య వస్తుంటుంది. దీనివల్ల నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో చుండ్రుని తగ్గించుకోవడానికి చాలామంది మార్కెట్లో లభించే ఎన్నో కెమికల్స్ ఉన్న షాంపులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎన్నో కెమికల్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ కాస్మటోఎక్స్ను యూస్ చేస్తూ ఉంటారు. వాటి వలన సమస్య ఇంకాస్త ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. అదే విధంగా దీనిలోని రసాయనాలు జుట్టు ఆరోగ్యం పై ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది.
కావున చుండ్రును తగ్గించుకోవడానికి సహజమైన పద్ధతులను వాడాలి. అని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చలికాలంలో చుండ్రు నుంచి బయటపడటం కోసం కొన్ని సులువమైన చిట్కాలను సోషల్ మీడియా వేదిక పంచుకుంటున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… ఒత్తిడికి దూరంగా ఉండాలి : ఒత్తిడి మీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలహీన పరుస్తూ ఉంటుంది. చుండ్రుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడే మీ శరీర సామర్థ్యాన్ని తగ్గేలా చేస్తుంది. కావున ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి వీలైనంతవరకు ఎక్ససైజ్, నడక, యోగ లాంటి వాటిని మీ జీవనశైలిలో ఒక భాగంగా మార్చుకోవాలి. వేపరసం : వేపరసం జుట్టు ఎదుగుదలను మెరుగుపడేలా చేస్తుంది.
Are you suffering from dandruff problem in winter
అలాగే చుండ్రు మీద బాగా ప్రభావం చూపుతుంది. స్కాల్ప్ మీద మూసుకుపోయిన రంధ్రాలను శుభ్రపరచడంలో ఉపయోగపడుతుంది. వేపరసంలోని పోషకాలు చుండ్రులు తగ్గించడంలో గొప్పగా పనిచేస్తాయి. దీనికోసం వేపాకులు పేస్టులా చేసి తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఉసిరి పొడి, పెరుగు : ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చుండ్రును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఇంకోవైపు మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పెరుగు చాలా ఉపయోగపరంగా ఉంటుంది. కావున పెరుగులో రెండు చెంచాల ఉసిరి పొడిని కలిపి దీనిని తలకి బాగా అప్లై చేసుకోవాలి. అలా ఒక 45 నిమిషాలు ఉంచుకొని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు..
